MS Dhoni: ధోనికి, ఆనంద్ మహీంద్రాకు ఉన్న సంబంధమేంటో తెలుసా? అవాక్కవుతారంతే!

|

Apr 15, 2024 | 10:05 PM

ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెలరేగి ఆడుతున్నాడు. ఆఖరులో బ్యాటింగ్ కు వచ్చినా ధనా ధన్ సిక్స్ లతో మైదానాన్ని హోరెత్తిస్తున్నాడు. ఇక ధోని బ్యాటింగ్ సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోతోంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

MS Dhoni: ధోనికి, ఆనంద్ మహీంద్రాకు ఉన్న సంబంధమేంటో తెలుసా? అవాక్కవుతారంతే!
Anand Mahindra, MS Dhoni
Follow us on

ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెలరేగి ఆడుతున్నాడు. ఆఖరులో బ్యాటింగ్ కు వచ్చినా ధనా ధన్ సిక్స్ లతో మైదానాన్ని హోరెత్తిస్తున్నాడు. ఇక ధోని బ్యాటింగ్ సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోతోంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ మ్యాచ్‌ లో చివరి నాలుగు బంతులు ఆడేందుకు మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది నాలుగో బంతికి 2 పరుగులు చేశాడు. మొత్తమ్మీద కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేసి ధనా ధన్ ధోని పేరును సార్ధకం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని పవర్ హిట్టింగ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముంబైకు మద్దతుగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిషేక్ బచ్చన్, నేహా ధూపియా, కరీనా కపూర్ సైతం మహీ ఇన్నింగ్స్ కు ముగ్ధులైపోయారు. తాజాగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ధోని ధనా ధన్ ఇన్నింగ్స్ కు ఫిదా అయ్యారు.

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌లు, వీడియోలను షేర్ చేస్తుంటారు. అలాగే కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సహాయం కూడా చేస్తుంటారు. అయితే ఈసారి ఆనంద్ మహీంద్రా ధోనిని ప్రశంసిస్తూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను షేర్ చేశారు. ‘ధోనీ కంటే గొప్పగా రాణిస్తున్న ఆటగాడిని ఒకరినైనా చూపించగలరా? అతనిపై ఉన్న భారీ అంచనాలు కావొచ్చు. జట్టు పరిస్థితి తీసుకొచ్చే ఒత్తిడి కారణమై ఉండొచ్చు. ఇవన్నీ అతని సంకల్ప బలాన్ని మరింత పెంచాయి. మహేంద్ర సింగ్ ధోని ఎప్పటికీ గొప్ప ఫినిషర్‌. నా పేరులో కూడా ‘మహీ’ ఉండటం గర్వంగా ఉంది’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తన పోస్టుకు ధోని ఫొటోను కూడా జత చేశారు.

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా ట్వీట్..

ఐపీఎల్ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో తొలి మూడు బంతుల్లో సిక్సర్ బాదిన తొలి బ్యాటర్ గా ధోనీ నిలిచాడు. 250 మ్యాచ్‌ల్లో ఒకే ఫ్రాంచైజీకి 5000 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇప్పటి వరకు 20వ ఓవర్లో ధోని 64 సిక్సర్లు బాదాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..