AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs SRH IPL 2024 Preview: పరాజయాల బాట వీడేనా.. సొంత మైదానంలో హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై..

Mumbai Indians vs Sunrisers Hyderabad, 55th Match: పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ స్థానం చాలా దారుణంగా ఉంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఆ జట్టు తన గత నాలుగు మ్యాచ్‌లలో వరుస పరాజయాలను చవిచూసింది. ఇప్పుడు పరువు కోసం గెలవాలని కోరుకుంటుంది. బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణించలేకపోవడం, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఎటువంటి మద్దతు పొందలేకపోవడం ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో కనిపించిన రెండు అతిపెద్ద లోపాలుగా మారాయి.

MI vs SRH IPL 2024 Preview: పరాజయాల బాట వీడేనా.. సొంత మైదానంలో హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై..
Mi Vs Srh Preview
Venkata Chari
|

Updated on: May 06, 2024 | 8:10 AM

Share

Mumbai Indians vs Sunrisers Hyderabad, 55th Match: ఐపీఎల్ 2024లో, సీజన్‌లోని 55వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య సోమవారం, మే 6న జరగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ముంబై జట్టుపై విజయం సాధించింది. MI ప్లేఆఫ్‌ల రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే SRH ఇప్పటికీ టాప్ 4 రేసులో స్థిరంగా ఉంది.

పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ స్థానం చాలా దారుణంగా ఉంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఆ జట్టు తన గత నాలుగు మ్యాచ్‌లలో వరుస పరాజయాలను చవిచూసింది. ఇప్పుడు పరువు కోసం గెలవాలని కోరుకుంటుంది. బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణించలేకపోవడం, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఎటువంటి మద్దతు పొందలేకపోవడం ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో కనిపించిన రెండు అతిపెద్ద లోపాలుగా మారాయి.

మరోవైపు, పాయింట్ల పట్టికలో, SRH 10 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తుఫాన్ బ్యాటింగ్ శైలితో ప్రత్యర్థి జట్లకు ఒకప్పుడు భయాన్ని కలిగించింది. కానీ, మధ్యలో కొన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే, తమ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు చివరి బంతికి రాజస్థాన్ రాయల్స్ వంటి బలమైన ప్రత్యర్థిని ఓడించి ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ మునుపటిలా తన బ్యాట్స్‌మెన్స్ నుంచి వేగంగా, భారీ ఇన్నింగ్స్‌లను ఆశిస్తుంది. అదే సమయంలో, బౌలింగ్ విభాగం ఇప్పటివరకు చాలా మంచి పని చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టు మరో విజయంతో ప్లేఆఫ్‌కు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్.

IPL 2024 55వ మ్యాచ్ కోసం ఇరు జట్ల స్క్వాడ్‌లు..

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఐడెన్ మర్క్‌రామ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూకీ, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, మయాంక్ అగర్వాల్, మయాంక్ మార్కండే, రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి సింగ్, షాబాజ్ అహ్మద్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఉపేంద్ర సింగ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణియన్.

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ఆకాష్ మాధ్వల్, అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రీవిస్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ సింగ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, పీయూష్ చావ్లా, రొమారియో షెపర్డ్, షామ్స్ ములానీ, సూర్యకుమార్ యాదవ్, టి. డేవిడ్, హార్విక్ దేశాయ్, నువాన్ తుషార, అన్షుల్ కాంబోజ్, నమన్ ధీర్, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, క్వేనా మఫాకా, ల్యూక్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్