AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ప్లేఆఫ్‌ చేరే నాలుగు జట్లు ఇవే.. టైటిల్ గెలవాలన్న ఆర్సీబీ కలకు అడ్డుగా ఆ మూడు టీంలు?

IPL 2023 Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ సగం దశకు చేరుకుంది. మొత్తం 10 జట్లు తమ తమ ఏడు మ్యాచ్‌లు ఆడాయి. ఈ విధంగా మొత్తం 36 మ్యాచ్‌లు ఆడాయి.

IPL 2023: ప్లేఆఫ్‌ చేరే నాలుగు జట్లు ఇవే.. టైటిల్ గెలవాలన్న ఆర్సీబీ కలకు అడ్డుగా ఆ మూడు టీంలు?
Ipl Captains
Venkata Chari
|

Updated on: Apr 27, 2023 | 5:20 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ సగం మార్కుకు చేరుకుంది. లీగ్ దశలో ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు జరిగాయి. మొత్తం 10 జట్లు తమ తమ ఏడు మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పుడు అన్ని జట్లు మరో ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆపై లీగ్ దశ ముగుస్తుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం టాప్-2 జట్లకు ఫైనల్స్‌కు చేరేందుకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో అన్ని జట్ల ప్రయత్నాలు చివరి రెండులో ఉండాలని కోరుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

సగం టోర్నమెంట్ మాత్రమే జరిగింది. కానీ, ప్లేఆఫ్‌ల లిస్ట్ కొంతవరకు స్పష్టమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. దీంతో పాటు ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి గుజరాత్ టైటాన్స్ కూడా గట్టి పోటీదారుగా ఉంది.

ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించింది. దీంతో ఎంఎస్ ధోని సేన 10 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో పాటు చెన్నై నెట్ రన్ రేట్ కూడా అత్యుత్తమంగా ఉంది. CSK నికర రన్ రేట్ +0.662. మరోవైపు రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా ఏడు మ్యాచ్‌లు ఆడగా ఐదింటిలో విజయం సాధించింది. నెట్ రన్ రేట్ +0.580గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే కనీసం 8 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. అయితే ఈసారి సమీకరణాల్లో మార్పులు వచ్చాయని తెలుస్తోంది. చివరి నాలుగుకు చేరుకోవడానికి 9 మ్యాచ్‌లు గెలవాలని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్ల ప్రస్తుత ఫామ్‌, పరిస్థితి చూస్తుంటే ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఖాయంగా భావిస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం అన్ని జట్లూ ప్లేఆఫ్‌కు చేరుకునే రేసులో ఉన్నాయి. అధికారికంగా ఏ జట్టు కూడా టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు అద్భుతం చేయడం ద్వారానే ప్లేఆఫ్‌కు చేరుకోగలవు.

ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య రేసు ఆసక్తికరంగా సాగనుంది. ఈ నాలుగు జట్లూ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచాయి. అయితే రాజస్థాన్ మూడో స్థానంలో, లక్నో నాలుగో స్థానంలో, ఆర్సీబీ ఐదో స్థానంలో, పంజాబ్ ఆరో స్థానంలో ఉన్నాయి. వీటిలో రెండు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తాయి. ఇలా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

RCB జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోకపోతే, ఈసారి కూడా టైటిల్ గెలవాలనే దాని కల చెదిరిపోతుంది. మొదటి సీజన్ నుంచి RCB ఒక్కసారి కూడా IPL టైటిల్ గెలవలేదు. అయితే, ఈసారి టోర్నీలో విజయం సాధించేందుకు జట్టును పోటీదారుగా పరిగణిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..