IPL 2023: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో బెంగళురుదే హవా.. దూసుకొచ్చిన కోహ్లీ.. టాప్ 5లో ఎవరున్నారంటే?
Orange Cap & Purple Cap Stats: ఆరెంజ్ క్యాప్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్ ముందంజలో ఉండగా, పర్పుల్ క్యాప్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన సిరాజ్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.
IPL 2023 Stats: ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు జరిగాయి. ఐపీఎల్ 2023 సీజన్ 36వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టీం 21 పరుగుల తేడాతో బెంగళూరుకు షాక్ ఇచ్చింది. మరోవైపు ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన డ్వేన్ కాన్వే మూడో స్థానానికి పడిపోయాడు. ఫాఫ్ డు ప్లెసిస్ 8 మ్యాచ్‌ల్లో 422 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన డ్వేన్ కాన్వే 7 మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేశాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 8 మ్యాచ్‌ల్లో 333 పరుగులు చేశాడు.
ఈ సీజన్‌లో ఈ బ్యాట్స్‌మెన్స్‌దే ఆధిపత్యం..
ఆరెంజ్ క్యాప్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 7 మ్యాచ్‌ల్లో 43.71 సగటుతో 306 పరుగులు చేశాడు. ఈ జాబితాలో వెంకటేష్ అయ్యర్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో అయ్యర్ 285 పరుగులు చేశాడు.
పర్పుల్ క్యాప్ రేసులో ఎవరు ఎక్కడ ఉన్నారు?
మరోవైపు బౌలర్ల విషయానికి వస్తే.. పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిలిచాడు. మహ్మద్ సిరాజ్ 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ 7 మ్యాచ్‌ల్లో 16.14 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా కోల్‌కతాకు చెందిన వరుణ్ చక్రవర్తి 13 వికెట్లతో మూడో స్థానానికి దూసుకొచ్చాడు. పంజాబ్ కింగ్స్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్ 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యుజ్వేంద్ర చాహల్ ఐదో స్థానంలో ఉన్నాడు. చాహల్ 7 మ్యాచ్‌ల్లో 12 మంది ఆటగాళ్లను పెవిలియన్ చేర్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..