PBKS vs MI, 1st Innings Highlights: సెంచరీ భాగస్వామ్యంతో బౌలర్లపై ఊచకోత..లివింగ్‌స్టోన్, జితేష్‌ల తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ముందు భారీ టార్గెట్..
PBKS vs MI: పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి కేవలం 3 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు భారీ స్కోర్ నిలిచింది. లియామ్ లివింగ్‌స్టోన్ 32 బంతుల్లో ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
IPL 2023 Punjab Kings vs Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బుధవారం ముంబై ఇండియన్స్(MI), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రెండో మ్యాచ్ కొనసాగుతోంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ 82 పరుగులు చేసి, జితేష్ శర్మతో కలిసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.
జితేష్ 27 బంతుల్లో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 2 వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది.
ఇరుజట్లు..
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
ముంబై ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, విష్ణు వినోద్, రమణదీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్.
పంజాబ్ ఇంపాక్ట్ ప్లేయర్స్: నాథన్ ఎల్లిస్, సికందర్ రజా, అథర్వ తైడే, మోహిత్ రాథీ, శివమ్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..