Video: ఇదేందిది.. ఇంత క్రియోటివ్ షాట్ ఏంటి సూర్య.. షాకైన గాడ్ ఆఫ్ క్రికెట్.. రిపీట్ చేస్తూ అదిరిపోయే రియాక్షన్..

MI vs GT: ముంబై విజయంలో సూర్యకుమార్ యాదవ్ హీరోగా నిలిచాడు. అతను 49 బంతుల్లో 103 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 11 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. సూర్య ఐపీఎల్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Video: ఇదేందిది.. ఇంత క్రియోటివ్ షాట్ ఏంటి సూర్య.. షాకైన గాడ్ ఆఫ్ క్రికెట్.. రిపీట్ చేస్తూ అదిరిపోయే రియాక్షన్..
Surya Kumar Yadav sachin
Follow us
Venkata Chari

|

Updated on: May 13, 2023 | 6:09 PM

MI vs GT, IPL 2023: ఐపీఎల్ 2023లో భాగంగా 57వ మ్యాచ్ శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆ తర్వాత గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది 7వ విజయం. 14 పాయింట్లతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

సూర్య తుఫాను ఇన్నింగ్స్..

ముంబై విజయంలో సూర్యకుమార్ యాదవ్ హీరోగా నిలిచాడు. అతను 49 బంతుల్లో 103 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 11 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. సూర్య ఐపీఎల్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అయితే, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా సూర్య ఇన్నింగ్స్‌కు అభిమాని అయ్యాడు. 19వ ఓవర్‌లో షమీ విసిరిన రెండో బంతికి స్కై క్రియేటివ్ షాట్ ఆడాడు. సూర్య ముందుకు వచ్చి బంతిని కవర్స్ వైపు ఆడాలని అనుకున్నాడు. కానీ, కవర్ డ్రైవ్ ఆడే చివరి క్షణంలో బ్యాట్‌ను కొంచెం తిప్పడంతో బంతి నేరుగా థర్డ్ మ్యాన్ దిశలో భారీ సిక్సర్‌గా వెళ్ళింది.

ఇవి కూడా చదవండి

ఆశ్చర్యపోయిన సచిన్..

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా సూర్యకుమార్ యాదవ్ చేసిన ఈ షాట్ చూసి ఆశ్చర్యపోయాడు. ఈషాట్‌ను తన చేతులతో పునరావృతం చేస్తూ కనిపించాడు. ఆయన రియాక్షన్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం “సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు మాయ చేశాడు. అతను ఇన్నింగ్స్ అంతటా అద్భుతమైన షాట్లు ఆడాడు. కానీ నాకు ప్రత్యేకంగా నిలిచేది మాత్రం థర్డ్ మ్యాన్ ఆఫ్‌పై అద్భుతమైన సిక్స్. అతను కోణాలను మారుస్తూ బ్యాట్‌ను తిప్పిన విధానం చాలా బాగుంది. ప్రపంచ క్రికెట్‌లో చాలా మంది బ్యాట్స్‌మెన్ ఆ షాట్ ఆడలేరు” అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..