
IPL 2023 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్ వేలం రెండు రోజుల్లో జరగనుంది. దీంతో అందరి దృష్టి అందులో పాల్గొనే ఆటగాళ్లపై ఉంది. వేలం కోసం ఆటగాళ్లు తమ బేస్ ధరను నిర్ణయించుకున్నారు. వేలంలో రూ.2 కోట్లు అత్యధిక బేస్ ప్రైస్ అయితే.. ఇందులో ఏ భారతీయ ఆటగాడు కూడా చేరలేదు.
అత్యధిక బేస్ ధరతో మొత్తం 21 మంది విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను జాబితాలో చేర్చారు. ఇందులో అత్యధికంగా తొమ్మిది మంది ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు చెందినవారే కావడం గమనార్హం. ఆస్ట్రేలియా నుంచి నలుగురు, న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నుంచి ఇద్దరు, శ్రీలంక నుంచి ఒక ఆటగాడు ఈ జాబితాలో తన పేరును పొందాడు. రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్ లిస్టులో ఏ భారతీయ ఆటగాడు కూడా చేరలేదు.
రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్: నాథన్ కౌల్టర్-నైల్ (ఆస్ట్రేలియా), కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా), టామ్ బాంటన్ (ఇంగ్లండ్), సామ్ కర్రాన్ (ఇంగ్లండ్), క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్), టైమల్ మిల్స్ (ఇంగ్లండ్), జామీ ఓవర్టన్ (ఇంగ్లండ్), క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్), జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), రైలీ రస్సో (దక్షిణాఫ్రికా), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా), ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక), నికోలస్ పూరన్ (వెస్టిండీస్), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్)
రూ. 1.5 కోట్ల బేస్ ఫ్రైజ్: సీన్ అబాట్ (ఆస్ట్రేలియా), రిలే మెరెడిత్ (ఆస్ట్రేలియా), ఝై రిచర్డ్‌సన్ (ఆస్ట్రేలియా), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), విల్ జాక్స్ (ఇంగ్లండ్), డేవిడ్ మలన్ (ఇంగ్లండ్), జాసన్ రాయ్ (ఇంగ్లండ్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్).
కోటి రూపాయల బేస్ ప్రైస్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ విడుదలై వేలం కోసం తన బేస్ ధర రూ.1 కోటిగా నిర్ణయించుకున్నాడు. వీరితో పాటు కేదార్ జాదవ్, మనీష్ పాండేలు కూడా తమ ప్రాథమిక ధర కోటి రూపాయలుగా ఉంచుకున్నారు. ఈ జాబితాలో విదేశీ ఆటగాళ్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది.
బేస్ ప్రైజ్ రూ. 1 కోటిలో ఉన్న ప్లేయర్లు: మయాంక్ అగర్వాల్ (భారతదేశం), కేదార్ జాదవ్ (భారతదేశం), మనీష్ పాండే (భారతదేశం), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్థాన్), మోయిసెస్ హెన్రిక్స్ (ఆస్ట్రేలియా), ఆండ్రూ టై (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్), ల్యూక్ వుడ్ (ఇంగ్లండ్), మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్), మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్), కైల్ జామీసన్ (న్యూజిలాండ్), మాట్ హెన్రీ (న్యూజిలాండ్), టామ్ లాథమ్ (న్యూజిలాండ్), డారెల్ మిచెల్ (న్యూజిలాండ్), హెన్రిచ్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా), తబ్రైజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా), కుసల్ పెరీరా (శ్రీలంక), రోస్టన్ చేజ్ (వెస్టిండీస్), రహ్కీమ్ కార్న్‌వాల్ (వెస్టిండీస్), షాయ్ హోప్ (వెస్టిండీస్), అకిల్ హుస్సేన్ (వెస్టిండీస్ ), డేవిడ్ వైస్ (నమీబియా).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..