
ఐపీఎల్ 2023లో 10 జట్లు సత్తా చాటుతూ.. ట్రోఫీ కోసం దూసుకపోతున్నాయి. ఈ 10 జట్లలో చాలా మంది ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. అయితే తాజాగా మరో ప్లేయర్ తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. IPL 2023 లో ప్రకంపనలు సృష్టించడానికి ఆసక్తిగా ఉన్నాడు. తన మొదటి మ్యాచ్ ఆడటానికి ముందు ప్రత్యర్థులకు సవాలు కూడా విసిరాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడబోతున్నాడు. ఈ సీజన్‌లో తన మొదటి మ్యాచ్‌ని మార్చి 14న ఆడేందుకు రెడీ అయ్యాడు. ఆయన ఎవరో కాదు.. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 2.8 కోట్లు ఖర్చు చేసి దక్కించుకున్న ప్లేయర్ జాసన్ రాయ్ గురించి మాట్లాడుతున్నాం.
IPL 2023లో తన మొదటి మ్యాచ్ ఆడటానికి ముందు, జాసన్ రాయ్ నెట్స్‌లో చెమటలు పట్టించాడు. పూర్తి ఫాంలో కనిపించాడు. ఈ క్రమంలో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. KKR ఫ్రాంచైజీని ప్రశంసించాడు. జాసన్ రాయ్ మాట్లాడుతూ.. కోల్‌కతా ఫ్రాంచైజీని చాలా ఇష్టపడ్డాను. టీం తరపున బరిలోకి దిగడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని కూడా ప్రశంసించాడు. ఇది చాలా అందమైన మైదానమని, నాకు చాలా జ్ఞాపకాలు ఇందులో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023లో కేకేఆర్ ఫ్రాంచైజీకి తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
IPL 2023లో KKR తదుపరి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. సొంతగడ్డపై గెలిచి వస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈసారి మ్యాచ్ జరగనుంది. KKR గత రెండు మ్యాచ్‌లను కూడా గెలుచుకుంది. అందులో ఒకటి ఈడెన్ గార్డెన్స్‌లో ఆడింది.
ఓవరాల్ గా జాసన్ రాయ్ పునరాగమనం తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం బలంగా కనిపిస్తోంది. మంచి విషయం ఏమిటంటే, జాసన్ రాయ్ తన కుటుంబంతో 14 రోజులు గడిపిన తర్వాత ఇంటికి వస్తున్నాడు. PSLలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అక్కడ అతను 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 145 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..