IPL 2022: లక్నో కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్? వైరలవుతోన్న హర్ష్ గోయెంకా ట్వీట్..!

IPL 2022: ఒక యూజర్ రాహుల్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దానికి లక్నో ఫ్రాంచైజీ యజమాని హర్ష్ గోయెంకా బదులిచ్చారు. రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు అతని బ్యాట్‌పై స్పాన్సర్ స్టిక్కర్ కనిపించలేదు.

IPL 2022: లక్నో కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్? వైరలవుతోన్న హర్ష్ గోయెంకా ట్వీట్..!
kl rahul
Follow us
Venkata Chari

|

Updated on: Jan 07, 2022 | 10:06 AM

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 (IPL-2022)లో, రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్‌లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. లక్నో జట్టును RPSG గ్రూప్ కొనుగోలు చేసింది. ఫ్రాంచైజీ తన జట్టు పేరును ఇంకా వెల్లడించలేదు. అంతే కాకుండా జట్టు కెప్టెన్‌, ఆటగాళ్ల పేర్లపై కూడా కర్టెన్‌ తొలగించలేదు. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్‌కు లక్నో జట్టు కమాండ్‌ ఇవ్వవచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

వాస్తవానికి, దక్షిణాఫ్రికాతో జరిగిన జోహన్నెస్‌బర్గ్ టెస్టులో రాహుల్ ఎటువంటి స్పాన్సర్ స్టిక్కర్ లేకుండా బ్యాట్‌తో ఆడుతున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత ఒక యూజర్ రాహుల్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దానికి లక్నో ఫ్రాంచైజీ యజమాని హర్ష్ గోయెంకా బదులిచ్చారు. రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు అతని బ్యాట్‌పై స్పాన్సర్ స్టిక్కర్ కనిపించలేదు. ఇదే విషయాన్ని రాహుల్ బ్యాట్ ఫోటోతో ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌పై, లక్నో ఫ్రాంచైజీ యజమాని హర్ష్ గోయెంకా స్వయంగా బదులిచ్చారు. తన బ్యాట్ వెనుక స్పాన్సర్ ఉన్నారు అంటూ సమాధానమిచ్చాడు. హర్ష్ గోయెంకా  ఈ సమాధానం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. దీనిపై చాలామంది నెటిజన్లు కూడా ఆయన్ను నిరంతరం ప్రశ్నిస్తున్నారు. గోయెంకా ఇచ్చిన ఈ సమాధానంతో, లక్నో ఫ్రాంచైజీకి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కేఎల్ రాహుల్‌ని రాబోయే IPL సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ రిటైన్ చేయలేదని తెలిసిందే. IPL చివరి రెండు సీజన్లలో రాహుల్ అత్యధిక పరుగులతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఫ్రాంచైజీ అతనిని రిటైన్ చేసుకోలేదు. రాహుల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నా రిలీజ్ చేసింది. రాహుల్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. జోహన్నెస్‌బర్గ్ టెస్టులో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. దీంతోపాటు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కూడా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. రోహిత్ శర్మ ఫిట్‌గా లేకపోవడంతో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Also Read: IPL 2022: హైదరాబాద్ వద్దంది.. బెంగళూరు ముద్దంది.. కోహ్లీ వారసుడిగా ఎస్‌ఆర్‌హెచ్‌ మాజీ ప్లేయర్?

Ravi Shastri vs Ganguly: కెప్టెన్సీ వివాదంపై రవిశాస్త్రి కీలక ప్రకటన.. అసలు కారణం అదేనంటూ గంగూలీపై సెటైర్లు