IPL-2022: హార్దిక్ పాండ్యా గొప్ప ఆటగాడు.. ఈ ఐపీఎల్​లో రాణిస్తాడు..

IPL 2022 మెగా వేలానికి ముందు అహ్మదాబాద్ తన జట్టుకు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. కెప్టెన్ పేరు కూడా ప్రకటించింది...

IPL-2022: హార్దిక్ పాండ్యా గొప్ప ఆటగాడు.. ఈ ఐపీఎల్​లో రాణిస్తాడు..
Ipl 2022 Hardhik Pandya
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 22, 2022 | 5:28 PM

IPL 2022 మెగా వేలానికి ముందు అహ్మదాబాద్ తన జట్టుకు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది. కెప్టెన్ పేరు కూడా ప్రకటించింది. కెప్టెన్​గా హార్దిక్ పాండ్యాను నియమించింది. హార్దిక్ పాండ్యాతో పాటు, కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీ అహ్మదాబాద్ రషీద్ ఖాన్, శుభ్‌మాన్ గిల్‌లను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ ముగ్గురిని చేర్చుకోవడానికి ఏకంగా 38 కోట్లు వెచ్చించింది. ఇందులో హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ లపై ఫ్రాంచైజీ రూ.15 కోట్లు ఖర్చు చేసింది. కాగా, 8 కోట్లు వెచ్చించి శుభ్‌మన్ గిల్‌ను తీసుకుంది.

అహ్మదాబాద్ జట్టు మెంటార్ గ్యారీ క్రిర్‌స్టెన్ హార్దిక్ పాండ్యాతో సహా ఇతర ఇద్దరు ఆటగాళ్ల గురించి కూడా మాట్లాడారు. అదే సమయంలో వారిపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా చెప్పాడు. “హార్దిక్ యువకుడు, కెప్టెన్సీకి కొత్త. వారితో పని చేయడం సరదాగా ఉంటుంది. అతను జట్టును ప్రోత్సహించడానికి పని చేస్తాడని నేను భావిస్తున్నాను. అతను అలాంటి కొన్ని ప్రణాళికలు వేస్తాడు, అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది అతనికి జట్టు నాయకుడిగా కొత్త గుర్తింపును ఇస్తుంది.” అని గ్యారీ క్రిర్‌స్టన్ చెప్పాడు.

“రషీద్ ఖాన్, శుభ్‌మాన్ గిల్‌ ఆటను చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శనకారులే. రషీద్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆడిన అనుభవం ఉంది. ఈ ఇద్దరితో కలిసి పనిచేయడం సరదాగా ఉంటుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను.” అని పేర్కొన్నాడు.

“ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌లో ఆడుతున్నాం. అటువంటి పరిస్థితిలో ఈ ఆటగాళ్లు కూడా తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని భావిస్తున్నారు. తద్వారా జట్టుకు విజయాన్ని అందించగలరు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి ప్రస్తుత సీజన్ చాలా ముఖ్యమైనది.” అని చెప్పాడు.

Read Also.. IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి దూరం కానున్న స్టార్ ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే