IPL 2022 Final: నేడే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. తుది పోరులో తలపడనున్న గుజరాత్, రాజస్థాన్..
ఆదివారం, మే 29, IPL (IPL 2022)కి చాలా ప్రత్యేకమైనది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) పోటీపడనున్నాయి. ఐపీఎల్‌లో రాజస్థాన్ ఒక సారి ఛాంపియన్ అయినప్పటికీ, చాలా సంవత్సరాలు గడిచాయి...
ఆదివారం, మే 29, IPL (IPL 2022)కి చాలా ప్రత్యేకమైనది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) పోటీపడనున్నాయి. ఐపీఎల్‌లో రాజస్థాన్ ఒక సారి ఛాంపియన్ అయినప్పటికీ, చాలా సంవత్సరాలు గడిచాయి. అయితే గుజరాత్ మొదటిసారి ఆడుతోంది. ఐపీఎల్ గత నాలుగు సీజన్లలో ఇలా ఫైనల్‌కు ముందు ప్రత్యర్థిపై ఏకపక్షంగా ఆధిక్యం ప్రదర్శించిన జట్టే తుది పోరులోనూ గెలిచింది. రాజస్తాన్ ఈసారి ఆ ట్రెండ్‌ను మారుస్తుందేమో చూడాలి. అన్నింటికి మించి లక్షకు పైగా ప్రేక్షకుల మధ్య సొంతగడ్డపై ఫైనల్ మ్యాచ్ ఆడబోతుండటం గుజ రాత్‌కు అనుకూలాంశం. ఫైనల్లోనూ టాస్ కీలకం కానుంది. గెలిచిన జట్టు ఫీల్డింగే ఎంచుకోవచ్చు.
వేలం ముగిశాక గుజరాత్ జట్టును చూస్తే అంత భీకరంగా ఏమీ కనిపించలేదు. కానీ ఒక్కో మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఆ జట్టు బలం బయటపడింది. ప్రతీ మ్యాచ్‌లో వేర్వేరు ఆటగాడు సత్తా చూపిస్తూ జట్టును గెలిపిస్తూ వచ్చారు. ఒకరిపైనే ఆధారపడకుండా సమష్టితత్వంతో టీమ్ వరుస విజయాలు సాధించింది. లీగ్ దశలో 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలవడం జట్టులో వారి విలువేమిటో చూపించింది. రాజస్తాన్ జట్టును బ్యాటింగ్‌లో ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సామర్థ్యం ఇద్దరికే ఉంది. ఒకరు జోస్ బట్లర్, మరొకరు కెప్టెన్ సామ్సన్. కొన్ని వైఫల్యాలు ఉన్నా…సామ్సన్ చెలరేగుతున్నప్పుడు అతడిని అడ్డుకోవడం ప్రత్యర్థికి సాధ్యం కాదు. సీజన్‌లో అతను 147.50 స్ట్రయిక్‌రేట్‌తో 444 పరుగులు సాధించడం దీనికి సూచిక. ఇక 16 మ్యాచ్‌లలో 824 పరుగులు చేసిన బట్లర్‌ను గుజ రాత్ ఎలా నిలువరిస్తుందనేదానిపైనే ఆ జట్టు విజ యావకాశాలు ఆధారపడి ఉన్నాయి.