AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: మెగా వేలంలో డివిలియర్స్, మ్యాక్స్‌వెల్.? ఆర్‌సీబీ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ వీరేనా.!

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాదికి తన జట్టులో రిటైన్ చేసుకునే ప్లేయర్స్‌పై...

IPL 2022: మెగా వేలంలో డివిలియర్స్, మ్యాక్స్‌వెల్.? ఆర్‌సీబీ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ వీరేనా.!
Maxwell
Ravi Kiran
|

Updated on: Nov 18, 2021 | 6:28 PM

Share

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాదికి తన జట్టులో రిటైన్ చేసుకునే ప్లేయర్స్‌పై మల్లగుల్లాలు పడుతున్నాయి. అనుభవం, ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ళను సెలెక్ట్ చేసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నలుగురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వాళ్లెవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యుజువేంద్ర చాహల్, దేవదూత్ పడిక్కల్‌లను బెంగళూరు ఫ్రాంచైజీ ఉంచుకోనున్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ అనే సైట్ తెలిపింది. విరాట్ కోహ్లీకి రూ. 16 కోట్లు, ఏబీ డివిలియర్స్‌కి రూ.12 కోట్లు, చాహల్‌కి రూ. 8 కోట్లు, పడిక్కల్‌కు రూ. 4 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. గతేడాది భారీ ధరకు పలికిన మ్యాక్స్‌వెల్ మరోసారి మెగా వేలంలోకి వెళ్లనున్నాడు.

ఐపీఎల్ 2020లో మ్యాక్సీ.. ఆర్‌సీబీకి ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లు అద్భుత విజయాలను అందించాడు. ఇదిలా ఉంటే కొంతమంది ఏబీ డివిలియర్స్ మెగా ఆక్షన్‌లో రానున్నాడని.. మ్యాక్స్‌వెల్‌నే బెంగళూరు జట్టు రిటైన్ చేస్తుందని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.! కాగా, వచ్చే ఏడాది కొత్త కెప్టెన్‌తో.. సరికొత్త టీంతో.. రెట్టింపు ఉత్సాహంతో ఐపీఎల్ ట్రోఫీని సాధించాలని ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఉవ్విళ్ళూరుతోంది. మరి చూడాలి బెంగళూరు ఐపీఎల్ 2022లోనైనా కప్పు గెలుస్తుందో.? లేదో.?

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?