Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌కు ఘన స్వాతం పలికిన తల్లి.. తరలొచ్చిన అభిమానులు..
యూఏఈలో ఐపీఎల్-2021 టైటిల్ గెలువడంలో ప్రాముఖ పాత్ర పోషించి, ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌కు తన తల్లి సాంప్రదాయ స్వాగతం పలికారు...
యూఏఈలో ఐపీఎల్-2021 టైటిల్ గెలువడంలో ప్రాముఖ పాత్ర పోషించి, ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌కు తన తల్లి సాంప్రదాయ స్వాగతం పలికారు. ఐపీఎల్ 2021 ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ని 27 పరుగుల తేడాతో ఓడించి సీఎస్కే నాలుగో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. గైక్వాడ్(24) ఆరెంజ్ క్యాప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ సీజన్‌ను రుతురాజ్ 635 పరుగులతో రాణించాడు. 45.35 సగటుతో ఏడు ఆఫ సెంచరీలు చేశాడు. ఫైనల్లో 59 బంతుల్లో 86 పరుగులు చేసి డు ప్లెసిస్ గైక్వాడ్‌కు రెండు పరుగుల దూరంలో నిలిచాడు. గైక్వాడ్ ఫైనల్ మ్యాచ్‌లో 32 పరుగులు చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్ 635, అతని తర్వాత డూప్లిసెస్ 633, కేఎల్ రాహుల్ 626, శిఖర్ ధావన్ 587, గ్లెన్ మాక్స్వెల్ 513 ఉన్నారు. కొంతమంది అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌లు ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నారు. సచిన్ టెండూల్కర్, మాథ్యూ హేడెన్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, కేన్ విలియమ్సన్ ఇంకా చాలా మంది ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న వారి జాబితాలో ఉన్నారు. రుతురాజుకు ఘన స్వాగతం పలికిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Mersal Arasan ? Home ?#WhistlePodu #Yellove ? @Ruutu1331 pic.twitter.com/SlOFnkvF9o
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) October 17, 2021
Read Also..T20 World Cup: విరాట్ కోహ్లీ కోసం కప్ గెలవండి.. ఆటగాళ్లకు సురేష్ రైనా సూచన..