IPL 2021: ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇంటికి.. ఆస్ట్రేలియా క్రికెటర్లు మాల్దీవులకు.. అసలు కారణం ఇదే.!
IPL 2021: దేశంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఇప్పటికే ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో విదేశీ ఆటగాళ్లను..

IPL 2021: దేశంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఇప్పటికే ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో విదేశీ ఆటగాళ్లను తమ స్వదేశాలకు పంపించేందుకు సిద్ధమైంది బీసీసీఐ. ఇందులో భాగంగా న్యూజిలాండ్‌కు చెందిన ప్లేయర్లు కొందరు నేరుగా స్వదేశానికి వెళ్లనుండగా.. మరికొందరు ఇక్కడే ఉండనున్నారు. అటు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లను.. వారి స్వదేశాలకు పంపేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఇలా తమ స్వంత స్థలాలకు చేరుకుంటున్నారు.
ఇక భారత విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు విధించిన కారణంగా ఆ దేశ ప్లేయర్స్ మాల్దీవులు చేరుకున్నారు. అక్కడ 15 రోజులు గడపనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిబంధనలను సరళీకరించే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత సొంతగూటికి చేరుకోనున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మాత్రం కోవిడ్ సోకడం వల్ల ఇక్కడే ఉండిపోయాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాతే చార్టెడ్ ఫ్లైట్ ద్వారా వెళ్తాడు. ఈ విషయాన్ని ఆసీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఇవి చదవండి:
ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..
Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?




