IPL 2021 Auction: ఆ ఇద్దరు ఆటగాళ్లే ముంబై ఇండియన్స్ టార్గెట్.. అర్జున్ టెండూల్కర్ ను సైతం దక్కించుకునే అవకాశం!
IPL 2021 Auction: ఆకర్ష్.. ఆకర్ష్.. ఆకర్ష్.. ఇప్పుడు అందరూ ఇదే పాట. పొలిటికల్ పార్టీలు అనుకుంటే పొరపాటే.. ఈ పాట పాడేది...
IPL 2021 Auction: ఆకర్ష్.. ఆకర్ష్.. ఆకర్ష్.. ఇప్పుడు అందరూ ఇదే పాట. పొలిటికల్ పార్టీలు అనుకుంటే పొరపాటే.. ఈ పాట పాడేది ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఐపీఎల్ 2021 టైటిల్ పై గురి పెట్టి తమ జట్లను బలోపేతం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. అందుకే ఇవాళ జరగబోయే మినీ వేలంలో స్టార్ ప్లేయర్స్ ను చేజిక్కించుకోవాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఎలాంటి ఆటగాళ్ల కోసం ప్లాన్స్ వేసుకుందో ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్….
పర్స్:
రూ. 15.35 కోట్లు, మిగిలిన స్లాట్లు – 7, విదేశీ స్లాట్లు – 4
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే…
టాప్-ఆర్డర్ బ్యాట్స్ మెన్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, అన్మోల్ ప్రీత్ సింగ్, ఆదిత్య తారే (వికెట్ కీపర్)
ఫినిషర్స్: కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా
ఆల్ రౌండర్లు: కృనాల్ పాండ్యా
స్పిన్నర్లు: రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్, జయంత్ యాదవ్
ఫాస్ట్ బౌలర్లు: జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ధావల్ కులకర్ణి, మొహ్సిన్ ఖాన్
ఎవరిని తీసుకోనున్నారు.? ఎందుకు.?
ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ఛాంపియన్స్ జట్టు. అయితే చిన్న చిన్న లోపాలు లేకపోలేదు. గత రెండు సీజన్లలో కృనాల్ పాండ్యా ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. అలాగే రాహుల్ చాహర్ స్పిన్ మంత్రం కూడా పని చేయలేదు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరూ ధారాళంగా పరుగులు సమర్పించారు.
అందుకే అత్యంత ఖరీదైన స్పిన్నర్ కోసం ఈ వేలంలో ముంబై సొంతం చేసుకోనుందని సమాచారం. అటు ట్రెంట్ బౌల్ట్ కోసం ఒక బ్యాకప్ విదేశీ సీమర్ ను, ఇక కీరన్ పొలార్డ్ కోసం మరో బ్యాకప్ విదేశీ ఆల్ రౌండర్ ను తీసుకోవాలని ముంబై జట్టు ప్రయత్నం చేయనుంది. అటు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను సైతం ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు.
ఈ ఆటగాళ్లపై గురి:
పీయూష్ చావ్లా, జై రిచర్డ్సన్, డేనియల్ క్రిస్టియన్, మొయిన్ అలీ, నాథన్ కౌల్టర్-నైల్, కైల్ జేమిసన్, టామ్ కుర్రాన్, బెన్ కట్టింగ్, శివమ్ దూబే, హర్భజన్ సింగ్, అర్జున్ టెండూల్కర్.