IPL 2021 Auction: గేమ్ స్టార్ట్.. ఐపీఎల్ 2021 మినీ వేలంలో మొదటి ఆటగాడు ఎవరో తెలుసా.!

IPL 2021 Auction: మినీ ఆక్షన్ రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే చెన్నై వేదికగా జరగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు..

IPL 2021 Auction: గేమ్ స్టార్ట్.. ఐపీఎల్ 2021 మినీ వేలంలో మొదటి ఆటగాడు ఎవరో తెలుసా.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 18, 2021 | 11:57 AM

IPL 2021 Auction: మినీ ఆక్షన్ రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే చెన్నై వేదికగా జరగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు ఈ ఆక్షన్ లో పాల్గొననున్నారు. ఈ లిస్టులో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇక ఈ వేలం ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ తో ప్రారంభం కానుంది.

ఫించ్ బేస్ ప్రైజ్ రూ. కోటి కాగా.. గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆర్సీబీ రూ. 4 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే ఫామ్ లేమితో ఫించ్ సతమతమవుతుండటంతో ఈ ఏడాది ఎవరు కొనుగోలు చేస్తారో వేచి చూడాలి. కాగా, ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు వద్ద అత్యధికంగా రూ. 53.2 కోట్లు ఉన్నాయి. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఐపీఎల్ 2021 ఆక్షన్ వివరాలు(IPL 2021 Auction LIVE Streaming online, Time, Venue)..

  • వేదిక: హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళా, చెన్నై
  • సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
  • వీక్షించండి ఇలా: హాట్ స్టార్ యాప్, స్టార్ స్పోర్ట్స్ ఛానల్
  • ప్లేయర్స్ సంఖ్య: 292(164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు