AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : రూ.214 కోట్ల సామ్రాజ్యం.. ముంబై నడిబొడ్డున కళ్లుచెదిరే ప్యాలెస్..రోహిత్ లగ్జరీ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Rohit Sharma : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విలాసవంతమైన లైఫ్ స్టైల్, ముంబైలోని రూ.214 కోట్ల ఆస్తి విశేషాలు తెలుసుకుందాం. అహుజా టవర్స్‌లోని ఆయన ఇంటి ఇంటీరియర్స్ ఫోటోలు, పూర్తి సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Rohit Sharma : రూ.214 కోట్ల సామ్రాజ్యం.. ముంబై నడిబొడ్డున కళ్లుచెదిరే ప్యాలెస్..రోహిత్ లగ్జరీ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Rohit Sharma
Rakesh
|

Updated on: Mar 31, 2026 | 9:03 AM

Share

Rohit Sharma : భారత క్రికెట్ గెలాక్సీలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఒక ధృవతార. కేవలం మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించడమే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ రోహిత్ శైలి అత్యంత విలాసవంతంగా ఉంటుంది. సుమారు రూ.214 కోట్ల నెట్ వర్త్‌తో, ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఒక అద్భుతమైన ప్యాలెస్ లాంటి ఇంట్లో ఆయన నివసిస్తున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం వర్లీ. ఇక్కడే ఉన్న అహుజా టవర్స్‎లో రోహిత్ శర్మ నివాసం ఉంటున్నారు. ఈ భవనం 53 అంతస్తులతో ముంబై ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటుంది. రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి 29వ అంతస్తులో ఒక భారీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి విలువ ప్రస్తుతం రూ.30 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ ఇంటి నుండి అరేబియా సముద్రం బ్యూటీఫుల్ వ్యూ కనిపిస్తుంది.

నెట్ వర్త్, ఆదాయ వనరులు

2026 నాటికి రోహిత్ శర్మ మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.214 కోట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కేవలం బీసీసీఐ (BCCI) కాంట్రాక్ట్ , ఐపీఎల్ (IPL) జీతం మాత్రమే కాకుండా, అనేక బహుళజాతి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఆయన కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా, పలు స్టార్టప్ కంపెనీల్లో కూడా రోహిత్ పెట్టుబడులు పెట్టారు. ఇటీవల ఐపీఎల్ 2026లో కేకేఆర్‌పై 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రోహిత్, తన ఫిట్‌నెస్ మార్పుతో నీతా అంబానీ ప్రశంసలు కూడా అందుకున్నారు.

ఇంటి లోపల ఆధునిక హంగులు

రోహిత్ శర్మ ఇంటిని చాలా ఆధునిక పద్ధతిలో డిజైన్ చేశారు. ముఖ్యంగా ఆయన లివింగ్ రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ ఉన్న గ్రే కలర్ సోఫాలు, మినిమలిస్టిక్ ఇంటీరియర్స్ ఆ గదికి ఒక క్లాసీ లుక్ ఇస్తాయి. రోహిత్ తన కూతురు సమైరాతో కలిసి ఆడుకునే వీడియోలు చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అవన్నీ ఈ లివింగ్ రూమ్‌లోనే చిత్రీకరించినవే. ఈ ఇంట్లో ఒక అద్భుతమైన గ్రీన్ గార్డెన్ కూడా ఉంది, ఇది ముంబై వంటి రద్దీ నగరంలో ప్రశాంతతను అందిస్తుంది.

సీ-ఫేసింగ్ బాల్కనీ

ఈ ఇంటికి ప్రధాన ఆకర్షణ భారీ బాల్కనీ. అక్కడి నుంచి ముంబై నగరాన్ని మరియు సముద్రాన్ని చూస్తుంటే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. రోహిత్ తరచుగా తన వర్కవుట్స్ ఇక్కడే చేస్తుంటారు. విలాసవంతమైన వస్తువులే కాకుండా, రోహిత్ ఇంట్లో ఒక ప్రశాంతమైన పూజా గది కూడా ఉంది. హిట్‌మ్యాన్ తన రోజును దైవ ప్రార్థనలతో ప్రారంభిస్తారని సన్నిహితులు చెబుతుంటారు. అత్యాధునిక జిమ్, హోమ్ థియేటర్, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకమైన ఓపెన్ స్పేస్ ఈ ఇంటిని ఒక స్వర్గంలా మార్చేశాయి.

Follow Us