IND vs ENG: రోహిత్ సేనకు బ్యాడ్‌న్యూస్.. గాయంతో సెంచరీ ప్లేయర్ దూరం.. 3వ టెస్ట్‌కు డౌట్?
Shubman Gill Injury, IND vs ENG: 399 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం 6 వికెట్లు కోల్పోయి 194 పరగులు చేసింది. బెయిర్ స్టో 26, జాక్ క్రాలే 73, బెన్ డకెట్ 28, రెహాన్ అహ్మద్ 23, ఓలీపోప్ 23, రూట్ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, కుల్దీప్, అక్షర్ పటేల్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇంగ్లండ్ విజయానికి మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా, భారత జట్టు విజయానికి మరో 4 వికెట్ల దూరంలో నిలిచింది.

Shubman Gill Injury: విశాఖపట్నం టెస్టులో నాలుగో రోజు టీమ్ ఇండియాకు మరో బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఈ వార్త టీమ్ ఇండియాలో ఆందోళనను మరింత పెంచింది. విషయం శుభ్‌మన్ గిల్‌కి సంబంధించినది కావడంతో ఉద్రిక్తత కూడా నెలకొంది. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ చేయడంతో భారత జట్టు ఇంగ్లండ్‌కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఈ స్కోరును కాపాడుకునేందుకు నాలుగో రోజు టీమ్ ఇండియా మైదానంలోకి వచ్చేసరికి ఆటగాళ్లందరిలో శుభ్‌మన్ గిల్ కనిపించలేదు. అతను గాయపడినట్లు తేలింది. దీని కారణంగా అతను ఫీల్డింగ్ చేసేందుకు రాలేదు. దీంతో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే శుభ్‌మన్ గిల్ ఎప్పుడు గాయపడ్డాడు? అసలు గాయమెలా అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు మైదానంలోకి రావడం కష్టంగా మారేంత గాయం ఎలా అయింది అంటున్నారు. గిల్ తన కుడి చేతి వేలికి గాయమైంది. నొప్పిని భరించాడు. అతను రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి సెంచరీ కూడా చేశాడు. కానీ, నాల్గవ రోజు మైదానం నుంచి నిష్క్రమించాడు.
శుభమాన్ గిల్ స్థానంలో మైదానంలోకి సర్ఫరాజ్ ఖాన్..
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, శుభమాన్ గిల్ కాకపోతే ఎవరు? అంటే, అతను ఫీల్డ్‌కి మైదానంలోకి రాకపోతే, అతని స్థానంలో ఎవరు వచ్చారు? అయితే ఈ ప్రశ్నకు సమాధానం సర్ఫరాజ్ ఖాన్. విశాఖపట్నం టెస్టులో నాలుగో రోజు 399 పరుగుల లక్ష్యంతో టీమిండియా మైదానంలోకి రాగా, గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు.
గిల్ గాయం ఎంత తీవ్రంగా ఉంది?
You witnessed a special 💯
Hear it from the man himself ☺️
Presenting centurion Shubman Gill 👍 👍 – By @ameyatilak #TeamIndia | #INDvENG | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/KeRf8mQAFk
— BCCI (@BCCI) February 5, 2024
గిల్ గాయం అంత తీవ్రంగా లేదని ఇప్పుడు భావిస్తున్నారు. తద్వారా మూడో టెస్టులో టీమిండియాకు అందుబాటులో ఉండగలడు. అయితే, ప్రస్తుతం గాయం తీవ్రతకు సంబంధించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.
జో రూట్ గాయం ఇంగ్లండ్‌కు టెన్షన్..
అంతకుముందు, ఇంగ్లాండ్ శిబిరం కూడా దాని అతిపెద్ద బ్యాట్స్‌మెన్ జో రూట్ గాయపడిన వార్త వచ్చినప్పుడు గాయాలతో పోరాడుతున్నట్లు కనిపించింది. మూడో రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రూట్ వేళ్లకు గాయమైంది. ఆ తర్వాత అతను మైదానం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
మ్యాచ్ పరిస్థితి..
399 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం 6 వికెట్లు కోల్పోయి 194 పరగులు చేసింది. బెయిర్ స్టో 26, జాక్ క్రాలే 73, బెన్ డకెట్ 28, రెహాన్ అహ్మద్ 23, ఓలీపోప్ 23, రూట్ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, కుల్దీప్, అక్షర్ పటేల్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇంగ్లండ్ విజయానికి మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా, భారత జట్టు విజయానికి మరో 4 వికెట్ల దూరంలో నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




