Paris Olympics 2024: ‘గోల్డెన్ బాయ్’కి గాయం.. కీలక అప్‌డేట్ ఇచ్చిన నీరజ్ చోప్రా కోచ్

|

Jul 22, 2024 | 10:32 AM

Neeraj Chopra Injury: తొడ నొప్పి కారణంగా నీరజ్ చోప్రా మేలో ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయం పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఫిట్‌నెస్ విషయంలో అభిమానులలో టెన్షన్‌ను పెంచింది. ఈ క్రమంలో నీరజ్ జర్మన్ కోచ్ అతని గాయంపై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. నీరజ్ చోప్రా జర్మన్ కోచ్ క్లాస్ బార్టోనిట్జ్ అతని ఫిట్‌నెస్ గురించి అన్ని ఆందోళనలను తోసిపుచ్చాడు. గత కొన్ని నెలలుగా నీరజ్‌ను ఇబ్బందిపెడుతున్న తొడ (అడక్టర్) గాయం ఇప్పుడు బాగానే ఉందని, అతను పారిస్ ఒలింపిక్స్ కోసం తీవ్రంగా సిద్ధమవుతున్నాడని చెప్పుకొచ్చాడు.

Paris Olympics 2024: గోల్డెన్ బాయ్కి గాయం.. కీలక అప్‌డేట్ ఇచ్చిన నీరజ్ చోప్రా కోచ్
Neeraj Chopra Injury
Follow us on

Neeraj Chopra Injury: తొడ నొప్పి కారణంగా నీరజ్ చోప్రా మేలో ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయం పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఫిట్‌నెస్ విషయంలో అభిమానులలో టెన్షన్‌ను పెంచింది. ఈ క్రమంలో నీరజ్ జర్మన్ కోచ్ అతని గాయంపై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. నీరజ్ చోప్రా జర్మన్ కోచ్ క్లాస్ బార్టోనిట్జ్ అతని ఫిట్‌నెస్ గురించి అన్ని ఆందోళనలను తోసిపుచ్చాడు. గత కొన్ని నెలలుగా నీరజ్‌ను ఇబ్బందిపెడుతున్న తొడ (అడక్టర్) గాయం ఇప్పుడు బాగానే ఉందని, అతను పారిస్ ఒలింపిక్స్ కోసం తీవ్రంగా సిద్ధమవుతున్నాడని చెప్పుకొచ్చాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్.. పారిస్‌లో టైటిల్ కోసం బలమైన పోటీదారుగా ఉన్నాడు. కానీ, అతని ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తే, అతని సీజన్ పర్ఫెక్ట్‌గా లేదు. అయితే, ఇప్పుడు విషయాలు తిరిగి ట్రాక్‌లో ఉన్నాయని బార్టోనిట్జ్ తెలిపాడు.

‘ అంతా ప్లాన్ ప్రకారం సాగుతోంది. ప్రస్తుతం తొడ గాయం సమస్య లేదు, బాగానే ఉంది. ఒలింపిక్స్‌ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆశిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

పారిస్ డైమండ్ లీగ్ ఆడని నీరజ్..

నీరజ్ చోప్రా తొడ నొప్పితో మేలో ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత, అతను జూన్ 18న ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో 85.97 మీటర్ల త్రోతో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా బలమైన పునరాగమనం చేశాడు. ఆ తర్వాత, అతను జులై 7న పారిస్ డైమండ్ లీగ్‌లో కూడా ఆడకూడదని నిర్ణయించుకున్నాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ పోటీలు ఆగస్టు 6న క్వాలిఫికేషన్ రౌండ్‌తో ప్రారంభం కానున్నాయి. ఇది ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఈ క్రమంలో నీరజ్ చోప్రా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈసారి కూడా బంగారు పతకం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..