Team India: భారత జట్టుకు కలసిరాని 2022.. కొనసాగుతోన్న పరాజయాల పరంపర.. ఎన్ని మ్యాచ్‌ల్లో ఓడిందంటే?

Indian Team: 2022 సంవత్సరం భారత జట్టుకు అంత మంచిగా లేదు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌తో పాటు ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత జట్టు ఎన్ని మ్యాచ్‌ల్లో ఓడిందో తెలుసుకుందాం.

Team India: భారత జట్టుకు కలసిరాని 2022.. కొనసాగుతోన్న పరాజయాల పరంపర.. ఎన్ని మ్యాచ్‌ల్లో ఓడిందంటే?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Dec 05, 2022 | 6:10 AM

Indian Team 2022: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. 2022లో ఓటమి భారత జట్టును వదలడం లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా భారత జట్టు ఓటమిని చవిచూస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 20 మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడిపోయింది. ఈ ఏడాది జట్టుకు అంత మంచిదిగా లేదు. ఇప్పటి వరకు భారత జట్టు మొత్తం 3 టెస్టులు, 7 వన్డేలు, 10 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అంతకుముందు న్యూజిలాండ్ పర్యటనలో కూడా భారత జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోయింది.

టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లోనూ ఓటమి..

ఇటీవల ఆడిన టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్‌లో కూడా భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచకప్‌లో ఆ జట్టు రాణించి సెమీఫైనల్‌కు చేరుకుంది. కానీ, సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది.

ఆసియా కప్‌లో సూపర్-4 నుంచి నిష్క్రమణ..

టీ20 ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఆసియా కప్ 2022లో భారత జట్టు సూపర్-4ను దాటలేకపోయింది. ఇక్కడ భారత జట్టు మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడగా, అందులో 3 గెలిచి 2 ఓడిపోయింది. ఇందులో పాకిస్థాన్‌, శ్రీలంకలపై ఓటమి పాలైంది.

ఇవి కూడా చదవండి

2015లోనూ బంగ్లాదేశ్‌తో సిరీస్‌ కోల్పోయిన భారత్..

అంతకుముందు 2015లో కూడా బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇరుజట్ల మధ్య ఇది ​​ఐదో సిరీస్‌. భారత జట్టు ఇప్పటి వరకు మొత్తం 3 సిరీస్‌లను గెలుచుకుంది. మరి ఈ సిరీస్‌ని కూడా భారత జట్టు కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..