Team India: 2024లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. తొలి సిరీస్ ఎప్పుడంటే?
Team India Schedule 2024: జనవరిలో, టీం ఇండియా దక్షిణాఫ్రికాతో రెండవ, చివరి టెస్టుతో కొత్త ఏడాది ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడుతుంది. టీ20 ప్రపంచకప్‌తో పాటు భారత జట్టు వివిధ ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది. అయితే 2024లో భారత క్రికెట్ జట్టు ఏ జట్టుతో ఆడుతుంది?, పూర్తి షెడ్యూల్ ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Team India Schedule 2024: 2023 భారత క్రికెట్ జట్టుకు గొప్ప సంవత్సరం అని చెప్పలేం. ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ రెండుసార్లు ఐసీసీ ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమితో 2023ని ముగించింది. అయితే 2024లో భారత క్రికెట్ జట్టు ఏ జట్టుతో ఆడుతుంది?, పూర్తి షెడ్యూల్ ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికాతో రెండో, చివరి టెస్టు, అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌తో పాటు భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వివిధ ఫార్మాట్లలో సిరీస్‌లు ఆడనుంది. మరోవైపు ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా బిజీబిజీగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత్ వెస్టిండీస్, యూఎస్‌ఏలకు వెళ్లనుంది.
టీమిండియా 2024 పూర్తి షెడ్యూల్..
జనవరి 3-7 దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు.
జనవరి 11 నుంచి 17 వరకు – స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల T20 సిరీస్.
జనవరి 25 నుంచి మార్చి 11 వరకు – స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్.
మార్చి చివరి నుంచి మే చివరి వరకు – ఐపీఎల్ 2024.
జూన్ 4 నుంచి జూన్ 30 వరకు – ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024.
జులై 2024- శ్రీలంకలో మూడు మ్యాచ్‌ల వన్డే; మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (తేదీ ప్రకటించలేదు)
సెప్టెంబర్ 2024- స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు టీ20లు, రెండు టెస్ట్ సిరీస్‌లు (తేదీ ప్రకటించలేదు)
అక్టోబర్ 2024 – స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
నవంబర్-డిసెంబర్ 2024- ఆస్ట్రేలియాలో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..