AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG 2nd T20I: టాస్ గెలిచిన భారత్.. మరోసారి వైభవ్‌కు మొండిచేయి..!

Afghanistan vs India, 2nd T20I: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికొద్ది సేపట్లో టాస్ జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IND vs AFG 2nd T20I: టాస్ గెలిచిన భారత్.. మరోసారి వైభవ్‌కు మొండిచేయి..!
Afghanistan Vs India
Venkata Chari
|

Updated on: Sep 15, 2026 | 7:13 PM

Share

Afghanistan vs India, 2nd T20I: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కోసం భారత్ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. కండరాల గాయం కారణంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బరిలోకి దిగాడు. అలాగే సంజూ శాంసన్‌పై గంభీర్ నమ్మకం ఉంచాడు.

భారత్‌పై తొలి విజయం కోసం ఆఫ్ఘనిస్తాన్ ఎదురుచూపులు..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 10 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 9 మ్యాచ్‌లు గెలవగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

7 వికెట్ల దూరంలో..

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి రషీద్ ఖాన్‌కు ఇంకా ఏడు వికెట్ల దూరంలో ఉన్నాడు. అతని పేరిట ఇప్పటికే 193 వికెట్లు ఉన్నాయి. ఈ ఘనత సాధిస్తే, అతను ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ అవుతాడు. ఈ ఏడాది ఏడు మ్యాచ్‌లలో ఇప్పటికే 12 వికెట్లు తీసిన అజ్మతుల్లా ఉమర్జాయ్ కూడా అతనితో చేరనున్నాడు. ఈ ఏడాది 8 మ్యాచ్‌లలో 318 పరుగులతో జట్టు తరపున అత్యధిక స్కోరర్‌గా ఉన్న తమ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ ఒక భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది.

ఇరు జట్లు:

ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ XI: రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్.

భారత్ ప్లేయింగ్ XI: సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us