England vs India: తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా అఖండ విజయం.. ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన భారత్
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయాన్ని అందుకుంది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా వికెట్ నష్టపోకుండా..
England vs India: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయాన్ని అందుకుంది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా వికెట్ నష్టపోకుండా మ్యాచ్ ను అవలీలగా పూర్తి చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (76*), శిఖర్ ధావన్ (31*) అజేయంగా నిలిచారు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ తర్వాత దూకుడు పెంచి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
బౌలింగ్ లో భారత్ ఆటగాళ్లు రాణించారు. జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాకిచ్చాడు. తన తొలి ఓవర్‌లోనే ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ముందుగా అతను జాసన్ రాయ్‌ను బౌల్డ్ చేసి, డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత నంబర్-3లో బ్యాటింగ్ కు వచ్చిన జో రూట్ ఖాతా కూడా తెరవలేక రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. బుమ్రా బౌలింగ్ లో జానీ బెయిర్ స్టో 7 పరుగులు చేసి పంత్ చేతికి చిక్కాడు. మొత్తంగా ఇంగ్లాండ్ 25 ఓవర్లకే ఆల్ అవుట్ అయ్యి 110 పరుగులను చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 18ఓవర్లకే మ్యాచ్ ను పూర్తి చేసింది. వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసి విజయం సాధించింది.