India vs New Zealand: న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా.. ఆ చెత్త రికార్డులకు శుభం కార్డు పడేనా?
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు.. ప్రస్తుతం రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. గురువారం హామిల్టన్ మైదానంలో ఆతిథ్య న్యూజిలాండ్‌తో ప్రపంచకప్‌లో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది.
India Women Vs New Zealand Women: ప్రపంచకప్‌లో పాకిస్థాన్(Pakistan)తో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు.. ప్రస్తుతం రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. గురువారం హామిల్టన్ మైదానంలో ఆతిథ్య న్యూజిలాండ్(INDW vs NZW)తో ప్రపంచకప్‌లో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. మహిళల వన్డే ప్రపంచ కప్(ICC Women’s World Cup 2022)లో కివీ జట్టుపై టీమిండియా రికార్డు చాలా పేలవంగా ఉంది. 44 ఏళ్లలో ఇరు జట్ల మధ్య మొత్తం 12 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్ కేవలం 2 గెలుపొందగా, న్యూజిలాండ్ 9 గెలిచింది. 1997 టోర్నీలో ఆడిన ఒక మ్యాచ్ టై అయింది. 2005, 2017 ప్రపంచకప్‌లలో భారత మహిళల జట్టు ఈ రెండు విజయాలను నమోదు చేసింది. 2005లో న్యూజిలాండ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో, గత ప్రపంచకప్‌లో 186 పరుగుల తేడాతో విజయం సాధించింది. విశేషమేమిటంటే.. టీమిండియా సాధించిన ఈ రెండు విజయాల్లోనూ మిథాలీ రాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఈసారి కూడా మిథాలీ నుంచి జట్టు అద్భుతమైన ప్రదర్శనను ఆశిస్తోంది.
న్యూజిలాండ్‌పై మిథాలీ రికార్డులు..
భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కివీస్‌పై 35 వన్డేల్లో 47.30 సగటుతో 1,230 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె 1 సెంచరీ, 9 అర్ధ సెంచరీలు సాధించింది. అంతకుముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ బ్యాటింగ్ మౌనంగా ఉండడంతో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యింది. ఈ మ్యాచ్ నుంచి ఆమె మళ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటోంది.
ప్రస్తుత టోర్నీలో న్యూజిలాండ్ టీం ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో జట్టు ఒక మ్యాచ్ గెలిచి, 1మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. భారత్‌పై ఉన్న పటిష్ట రికార్డు, స్వదేశీ పరిస్థితుల ఆధారంగా ఈ మ్యాచ్‌లోనూ కివీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.
మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య గురువారం మార్చి 10న మ్యాచ్ జరగనుంది. హామిల్టన్‌లోని సిడాన్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.
మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది?
భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ 6 గంటలకు వేయనున్నారు.
లైవ్ ఎక్కడ చూడాలి?
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. ఈ మ్యాచ్ మాత్రమే కాదు, ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో మాత్రమే ప్రసారం చేయనున్నారు. హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్‌ను చూడొచ్చు.
రెండు జట్లు..
భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా (కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, అమేలియా కెర్, అమీ సాటర్త్‌వైట్, మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, కేటీ మార్టిన్ (కీపర్), లీ టహుహు, హేలీ జెన్సన్, జెస్ కెర్, రోజ్మేరీ మేయర్, హన్నా రోవ్, ఫ్రాన్ జోనాస్, జార్జియా ప్లైమర్ , ఫ్రాన్సిస్ మెక్కే.
Also Read: Watch Video: వావ్.. సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్.. సలాం కొడుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో
18 బంతుల్లో 9 పరుగులు చేయలేకపోయిన ఇంగ్లాండ్.. వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమి..