IND vs ENG 3rd T20I: మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్ గెలిచిన ఇంగ్లండ్..
India Women vs England Women: మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు తొలి షాక్ ఇవ్వడంలో టీమిండియా మహిళలు విజయవంతమయ్యారు. తొలి ఓవర్ మూడో బంతికే మహియా బౌచియర్ (0)ని రేణుకా సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత సోఫియా డంక్లీ (11) వికెట్ కోల్పోయింది.
IND vs ENG 3rd T20I: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా, ఇంగ్లండ్ పరాజయం పాలైనప్పటికీ, మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచిన ఇంగ్లీష్ జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు తొలి షాక్ ఇవ్వడంలో టీమిండియా మహిళలు విజయవంతమయ్యారు. తొలి ఓవర్ మూడో బంతికే మహియా బౌచియర్ (0)ని రేణుకా సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత సోఫియా డంక్లీ (11) వికెట్ కోల్పోయింది.
అలిస్ క్యాప్సీ (7), అమీ జోన్స్ (25)లను సైకా ఇషాక్ ఔట్ చేసింది. అయితే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ 42 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేసింది. ఈ హాఫ్ సెంచరీ సాయంతో ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా తరపున సైకా ఇషాక్ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది.
127 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు స్మృతి మంధాన శుభారంభం అందించగా, షఫాలీ వర్మ (6) తొందరగానే ఔటైంది. ఈ దశలో స్మృతి, జెమీమాతో 2వ వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
అర్ధ సెంచరీ భాగస్వామ్యం తర్వాత జెమీమా రోడ్రిగ్రాస్ (29) ఎల్బీడబ్ల్యూగా నిష్క్రమించింది. ఆ తర్వాత 48 పరుగులు చేసిన స్మృతి మంధాన కూడా పెవిలియన్ చేరింది. చివరకు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరాజయం పాలైనప్పటికీ, తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
View this post on Instagram
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాంకా పాటిల్, టిటాస్ సాధు, సైకా ఇషాక్, అమంజోత్ కౌర్, రేణుకా ఠాకూర్ సింగ్.
ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: సోఫియా డంక్లీ, మాయా బౌచియర్, అలిస్ క్యాప్సే, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హీథర్ నైట్ (కెప్టెన్) డేనియల్ గిబ్సన్, బెస్ హీత్, ఫ్రెయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, మహికా గౌర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..