IND vs SL, Asia Cup 2023 Highlights: ఉత్కంఠ పోరులో గెలిచిన భారత్.. ఫైనల్ చేరిన రోహిత్ సేన..

Venkata Chari

|

Updated on: Sep 12, 2023 | 11:22 PM

IND vs SL, Asia Cup 2023 Highlights: ఆసియా కప్-2023లో సూపర్-4 దశ నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం పిచ్‌పై భారత జట్టు వికెట్లన్నీ స్పిన్నర్ల చేతుల్లోనే పడ్డాయి. వన్డే చరిత్రలో స్పిన్నర్లపై భారత్ వికెట్లన్నీ పడిపోవడం ఇదే తొలిసారి.

IND vs SL, Asia Cup 2023 Highlights: ఉత్కంఠ పోరులో గెలిచిన భారత్.. ఫైనల్ చేరిన రోహిత్ సేన..
Ind Vs Sl

Asia cup 2023 India vs Sri Lanka Highlights in Telugu: ఆసియా కప్‌ 2023 లో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. నాలుగో సూపర్-4 మ్యాచ్‌లో భారత జట్టు 41 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకను ఓడించింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం శ్రీలంక జట్టు 41.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది.

ఆసియా కప్-2023లో సూపర్-4 దశ నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం పిచ్‌పై భారత జట్టు వికెట్లన్నీ స్పిన్నర్ల చేతుల్లోనే పడ్డాయి. వన్డే చరిత్రలో స్పిన్నర్లపై భారత్ వికెట్లన్నీ పడిపోవడం ఇదే తొలిసారి.

నిన్న రిజర్వ్ డేలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. టీమిండియా నేడు వరుసగా రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో సూపర్ 4లో భాగంగా రెండో మ్యాచ్ ఆడనుంది. ఈరోజు కొలంబో వేదికగా శ్రీలంకపై భారత్ గెలిస్తే ఫైనల్ చేరుకుంటుంది. కానీ, శ్రీలంక స్వదేశంలో ఆడుతుంది కాబట్టి తేలిగ్గా తీసుకోలేం. అందుకే పాకిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంకను ఓడించేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు కనిపించింది. వాతావరణం విషయానికొస్తే, మ్యాచ్ సమయంలో వర్షం ప్రభావం కనిపించవచ్చు. కానీ, పెద్దగా అడ్డుపడే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 12 Sep 2023 11:20 PM (IST)

    ఫైనల్ చేరిన భారత్..

    ఆసియా కప్‌ 2023 లో భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. నాలుగో సూపర్-4 మ్యాచ్‌లో భారత జట్టు 41 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకను ఓడించింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం శ్రీలంక జట్టు 41.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది.

  • 12 Sep 2023 09:39 PM (IST)

    6 వికెట్లు డౌన్..

    శ్రీలంక 26 ఓవర్లలో 6 వికెట్లకు 101 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 113 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, టీమిండియాకు మరో 4 వికెట్లు కావాలి.

  • 12 Sep 2023 09:11 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన లంక..

    శ్రీలంక జట్టు 18 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. డిసిల్వా 1, అసలంక 22 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 12 Sep 2023 08:16 PM (IST)

    మూడు వికెట్లు కోల్పోయిన లంక..

    ఆసియా కప్-2023లో సూపర్-4 దశ నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం శ్రీలంక 7.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది.

  • 12 Sep 2023 07:30 PM (IST)

    లంక టార్గెట్ 214

    భారత జట్టు 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంక ముందు స్వల్ప స్కోర్ టార్గెట్‌గా నిలిచింది.

  • 12 Sep 2023 07:03 PM (IST)

    వర్షంతో ఆగిన మ్యాచ్..

    భారత జట్టు 47 ఓవర్లలో 9 వికెట్లకు 197 పరుగులు చేసింది. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది.

  • 12 Sep 2023 06:03 PM (IST)

    8 వికెట్లు డౌన్..

    భారత జట్టు 42.1 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నాడు.

  • 12 Sep 2023 05:14 PM (IST)

    పెవిలియన్ చేరిన కేఎల్ రాహుల్..

    పాకిస్తాన్‌పై సెంచరీతో రీఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ శ్రీలంకపై కేవలం 39 పరుగులకే పెవిలియన్ చేరాడు. వెల్లలాగే బౌలింగ్‌లో రివర్స్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే, ఇప్పటి వరకు లంక బౌలర్లలో వెల్లలాగే ఒక్కడే ఈ 4 వికెట్లు పడగొట్టడం విశేషం.

  • 12 Sep 2023 04:55 PM (IST)

    IND vs SL Live Score: 25 ఓవర్లకు..

    భారత జట్టు 25 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.

    53 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. దునిత్ వెల్లాలఘే బౌలింగ్‌లో అవుటయ్యాడు. వెల్లగేకు ఇది మూడో వికెట్. అతను విరాట్ కోహ్లి (3 పరుగులు), శుభ్‌మన్ గిల్ (19 పరుగులు) వికెట్లను కూడా పడగొట్టాడు.

  • 12 Sep 2023 04:16 PM (IST)

    పెవిలియన్ చేరిన రోహిత్..

    టీమిండియా ఆటగాళ్లు లంక స్పిన్ బౌలర్లను ఆడలేక వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. గిల్, కోహ్లీ తర్వాత ఇప్పుడు రోహిత్ కూడా పెవిలియన్ చేరాడు. 53 పరుగులు చేసిన తర్వాత లంక స్పిన్నర్ వెల్లలాగే బౌలింగ్‌లో ఔట్ అయ్యడు.

  • 12 Sep 2023 04:12 PM (IST)

    కోహ్లీ ఔట్..

    గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ, శ్రీలంపై కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది.

  • 12 Sep 2023 03:56 PM (IST)

    గిల్ ఔట్..

    టీమిండియా 80 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. గిల్ 19 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 12 Sep 2023 03:37 PM (IST)

    10,000 వన్డే పరుగుల క్లబ్‌లో చేరిన రోహిత్..

    కొలంబోలో శ్రీలంకతో జరుగుతోన్న ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 10,000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. దీంతో సచిన్ రికార్డును బ్రేక్ చేసి, లిస్టులో 2వ స్థానానికి చేరాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.

  • 12 Sep 2023 03:36 PM (IST)

    రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్, గిల్ జోడీ..

    రోహిత్, గిల్ కేవలం 12 ఇన్నింగ్స్‌లలోనే 1000 ODI పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన భారత జోడీగా నిలిచారు.

  • 12 Sep 2023 03:33 PM (IST)

    హాఫ్ సెంచరీకి చేరువలో స్కోర్..

    ఓపెనర్స్ రోహిత్, గిల్ మరో కీలక భాగస్వామ్యానికి తెర తీశారు. ప్రస్తుతం భారత్ 7 ఓవర్లు ముగిసే సరికి 43 పరుగులు చేసింది. రోహిత్ 23, గిల్ 13 పరుగులతో నిలిచారు. ఈ క్రమంలో రోహిత్ 10000 వన్డే పరుగుల క్లబ్ చేరాడు.

  • 12 Sep 2023 03:14 PM (IST)

    ఆచితూచి ఆడుతోన్న ఓపెనర్స్..

    3 ఓవర్లు ముగిసే సిరిక టీమిండియా వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. రోహిత్ 11, గిల్ 4 పరుగులతో నిలిచారు.

  • 12 Sep 2023 02:57 PM (IST)

    శార్దుల్ ఔట్.. అక్షర్ ఇన్..

    శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో ఒక మార్పు చేశాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించాడు. మరోవైపు శ్రీలంక జట్టులో ఒక్క మార్పు కూడా లేదు.

  • 12 Sep 2023 02:41 PM (IST)

    ఇరు జట్లు:

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

    శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.

  • 12 Sep 2023 02:32 PM (IST)

    టాస్ గెలిచిన భారత్..

    టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో లంక బౌలింగ్ చేయనుంది.

  • 12 Sep 2023 02:24 PM (IST)

    Shreyas Iyer Injury Update: శ్రేయాస్ అయ్యార్‌పై కీలక అప్‌డేట్..

    ఆసియా కప్‌లో భారత్-శ్రీలంక మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాసేపట్లో టాస్ జరగనుంది. అయితే అంతకంటే ముందే శ్రేయాస్ అయ్యర్ గాయం గురించిన అప్‌డేట్ వచ్చింది. అతని గాయం నయమవుతోందని బీసీసీఐ ట్వీట్ చేసింది. అయితే అతను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని, హోటల్‌లోనే ఉండమని సలహా ఇచ్చారని తెలిపింది. అతను టీమ్ ఇండియాతో కలిసి స్టేడియానికి చేరుకోలేదు.

  • 12 Sep 2023 02:21 PM (IST)

    IND vs SL Live Score: సమయానికి టాస్..

    కొలంబోలో భారత్-శ్రీలంక మ్యాచ్‌కు ముందు వాతావరణం క్లియర్‌గా మారింది.  దీంతో టాస్ ఆలస్యమయ్యే ఛాన్స్ లేదు. షెడ్యూల్ ప్రకారమే టాస్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

  • 12 Sep 2023 02:20 PM (IST)

    IND vs SL Weather Update: కొలంబోలో వాతావరణం..

    భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్‌కు ముందు కొలంబోలో వాతావరణం స్పష్టంగా ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆకాశం మేఘావృతమైందని వార్తలు వచ్చాయి. కానీ. వర్షం కురిసే సూచన అంతగా లేకపోవడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

  • 12 Sep 2023 02:14 PM (IST)

    జోరుమీదున్న భారత్..

    ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఈరోజు భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ఎందుకంటే ఎవరు గెలిచినా ఫైనల్ ఆడడం ఖాయం. పాక్‌ను చిత్తు చేసిన ఉత్సాహంతో శ్రీలంకపైనా గెలిచేందుకు భారత్ వరుసగా రెండో రోజు బరిలోకి దిగనుంది.

Published On - Sep 12,2023 2:09 PM

Follow us