IND vs SL T20I: లంకను దాటడం అంత ఈజీ కాదు.. గత 6 టీ20 మ్యాచ్‌ల ఫలితాలు చూస్తే షాకే..
IND vs SL 1st T20I: భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేడు (జనవరి 3) వాంఖడే స్టేడియంలో జరగనుంది.
IND vs SL T20I Records: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఈ రోజు మొదటి మ్యాచ్‌లో భారత్ వర్సెస్ శ్రీలంక (IND vs SL) జట్లు తలపడనున్నాయి. 4 నెలల తర్వాత ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకుముందు, ఈ రెండు జట్లు ఆసియా కప్ 2022లో తలపడ్డాయి. ఇక్కడ శ్రీలంక టీమ్ ఇండియాను ఏకంగా టోర్నమెంట్ నుంచే పంపేసింది. కాగా, గత 6 మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే, ఈ యువ శ్రీలంక జట్టు భారత్‌కు సమాన పోటీని ఇచ్చింది. గత 6 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ మూడు మ్యాచ్‌లు గెలవగా, శ్రీలంక మూడు మ్యాచ్‌లు గెలిచింది.
ఆసియా కప్‌లో ఘోర పరాజయం..
2022 ఆసియా కప్‌లో ఫైనల్స్‌కు చేరుకోవాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ శ్రీలంకపై టీమిండియా గెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 173 పరుగుల డీసెంట్ స్కోరు సాధించింది. అయితే భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. శ్రీలంక ఓపెనింగ్ జోడీ ద్వారా బలమైన ఆరంభం తర్వాత, భానుక రాజపక్సే, దసున్ షనక అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో శ్రీలంక ఒక బంతి మిగిలి ఉండగానే మ్యాచ్‌ను గెలుచుకుంది.
ఫిబ్రవరి 2022లో భారత్ ఏకపక్ష విజయం..
ఆసియా కప్‌నకు ముందు, ఫిబ్రవరి 2022లో భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో శ్రీలంకపై టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి క్లీన్ స్వీప్ చేసింది. తొలి మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గెలుపొందిన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
జులై 2021లో శ్రీలంకదే పైచేయి..
Excitement levels ? as the #INDvSL T20I series starts today ✅#TeamIndia | @mastercardindia pic.twitter.com/NAU8w6cIrS
— BCCI (@BCCI) January 3, 2023
కొలంబోలో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో శ్రీలంక భారత జట్టును ఓడించింది. 2021 జులై 28న జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రతిస్పందనగా శ్రీలంక 4 వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. ఆ తర్వాత, 29 జులై 2021న జరిగిన మ్యాచ్‌లో, టీమ్ ఇండియా కేవలం 81 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక కేవలం 15 ఓవర్లలో మ్యాచ్‌ను గెలుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..