AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL, 1st Test: ఆ చెత్త రికార్డులో ధోని సరసన చేరిన రిషబ్ పంత్.. అదేంటంటే?

మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక(India vs Sri Lanka) జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు తొలిరోజు శుక్రవారం భారత్ 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రిషబ్ పంత్(Rishabh Pant) సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు. 97 బంతుల్లో 96 పరుగులు చేసి..

IND vs SL, 1st Test: ఆ చెత్త రికార్డులో ధోని సరసన చేరిన రిషబ్ పంత్.. అదేంటంటే?
India Vs Sri Lanka Rishabh Pant
Venkata Chari
|

Updated on: Mar 05, 2022 | 9:59 AM

Share

మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక(India vs Sri Lanka) జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు తొలిరోజు శుక్రవారం భారత్ 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రిషబ్ పంత్(Rishabh Pant) సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు. 97 బంతుల్లో 96 పరుగులు చేసి, ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు అవాంఛిత రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 90, 100 పరుగుల మధ్య ఔట్ అయిన మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ప్రపంచ రికార్డును పంత్ సమం చేశాడు. ప్రస్తుతం ఐదు సెంచరీలు మిస్సయిన ధోనీతో కలిసి వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అదే సమయంలో అతని తర్వాత క్వింటన్ డి కాక్ పేరు వస్తుంది. డికాక్ 4 సార్లు సెంచరీ కోల్పోయాడు.

25 ఏళ్లలోపు తొంభైలలో అత్యధికంగా ఔటైన రికార్డులో.. పంత్ 25 ఏళ్లలోపు తొంభైలలో అత్యధికంగా ఔటైన రికార్డును సమం చేశాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా సమం చేశాడు. పంత్‌లాగే డివిలియర్స్‌ కూడా 25 ఏళ్లలోపు ఐదుసార్లు టెస్టు సెంచరీని కోల్పోయాడు.

90-100 పరుగుల మధ్య అవుట్.. పంత్, 2018లో రాజ్‌కోట్, హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 92 పరుగులతో ఔటయ్యాడు. ఈ ఏడాది శ్రీలంకపై 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో 97 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో, 2021లోనే, ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 91 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

ఇప్పటి వరకు పంత్ 9 సెంచరీలు మిస్.. పంత్ 90-100 పరుగుల మధ్య 5 సార్లు ఔట్ కాకపోయి ఉంటే.. ఇప్పటివరకు 9 సెంచరీలు సాధించి ఉండేవాడు. పంత్ ప్రస్తుతం 29 మ్యాచ్‌ల్లో 40.69 సగటుతో 1831 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి.

జడేజాతో పంత్ సెంచరీ భాగస్వామ్యం.. మొహాలీలో శుక్రవారం తొలి టెస్టు తొలి రోజున రవీంద్ర జడేజాతో సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. వీరిద్దరి మధ్య 104 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. పంత్ 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. జడేజా 45 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వికెట్‌కు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ 52 పరుగులు జోడించారు. రోహిత్ 29 పరుగుల వద్ద ఔట్ కాగా, మయాంక్ అగర్వాల్ 33 పరుగులు చేశాడు.

Also Read: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ ఇక లేరు

Women’s World Cup 2022: టైటిల్ గెలవాలంటే ఈ ప్లేయర్లే కీలకం.. పాక్‌తో పోరుకు సిద్ధమైన టీమిండియా ఉమెన్స్..