AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs PAKW: నో హ్యాండ్ షేక్.. టాస్‌లో కరచాలనం చేయని భారత్, పాక్ కెప్టెన్లు..!

India Women vs Pakistan Women, 6th Match, Group A, ICC Women's T20 World Cup 2026: మైదానంలో ఆటగాళ్ల మధ్య ఎంతటి పోటీ ఉన్నప్పటికీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ముఖ్యమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుండగా, దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని మరికొందరు భారత కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

INDW vs PAKW: నో హ్యాండ్ షేక్.. టాస్‌లో కరచాలనం చేయని భారత్, పాక్ కెప్టెన్లు..!
Indw Vs Pkaw Women Womens T20 Wc
Venkata Chari
|

Updated on: Jun 14, 2026 | 7:07 PM

Share

India Women vs Pakistan Women, 6th Match, Group A, ICC Women’s T20 World Cup 2026:  చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే మైదానంలో భావోద్వేగాలు నరాల తెగుతుంటాయి. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు కరచాలనం చేయకుండానే వెనుదిరగడం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టాస్ వేదికగా రాజుకున్న వివాదం!

ప్రతిష్టాత్మక బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా భారత్, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. టాస్ కోసం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్తాన్ సారథి ఫాతిమా సనాతో కలిసి మైదానంలోకి అడుగుపెట్టింది. ఈ ఉత్కంఠభరిత పోరులో టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమాత్రం ఆలోచించకుండా మొదట బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

ఫాతిమాను పట్టించుకోకుండా వెనుదిరిగిన భారత కెప్టెన్!

టాస్ గెలిచిన అనంతరం బ్రాడ్‌కాస్టింగ్ బృందం అడిగిన ప్రశ్నలకు హర్మన్‌ప్రీత్ సమాధానమిచ్చింది. జట్టు వివరాలను, మొదట బ్యాటింగ్ ఎంచుకోవడానికి గల కారణాలను వివరించిన వెంటనే, ఆమె పక్కనే నిలబడిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అంతర్జాతీయ క్రికెట్ సంప్రదాయం ప్రకారం టాస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు పరస్పరం కరచాలనం (హ్యాండ్‌షేక్) చేసుకోవడం ఆనవాయితీ. కానీ హర్మన్‌ప్రీత్ ఆ సంప్రదాయాన్ని పూర్తిగా పక్కనబెట్టి, ఫాతిమాను పూర్తిగా విస్మరిస్తూ నేరుగా భారత డగౌట్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయింది.

కొనసాగుతున్న ‘నో హ్యాండ్‌షేక్’ సంప్రదాయం

భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య మైదానంలో మునుపటిలాంటి సత్సంబంధాలు లేవనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది. గత 2025 ఆసియా కప్ సమయంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ‘నో హ్యాండ్‌షేక్’ (కరచాలనం చేయకూడదు) అనే అలిఖిత నిబంధనను ఆటగాళ్లు పాటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ అదే పంథాను కొనసాగిస్తూ, పాక్ కెప్టెన్‌కు భారత సారథి షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం గమనార్హం.

మైదానంలో ఆటగాళ్ల మధ్య ఎంతటి పోటీ ఉన్నప్పటికీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ముఖ్యమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతుండగా, దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని మరికొందరు భారత కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ కరచాలన వివాదం ప్రపంచకప్ మ్యాచ్ ఉత్కంఠను మరింత వేడెక్కించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us