Ind W vs Pak W: పాకిస్తాన్‌తో తొలి సమరానికి సై అంటోన్న భారత్.. మ్యాచ్ ఫలితాన్ని మార్చే ‘గేమ్ ఛేంజర్’లు వీరే?
Women's T20 World Cup 2023: మహిళల టీ20 వరల్డ్ కప్ 2023లో భారత్ తన తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఢీకొట్టనుంది. రేణుకా సింగ్, దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లో టీమిండియాకు గేమ్ ఛేంజర్‌లుగా మారొచ్చు.
India vs Pakistan Women’s T20 World Cup 2023: మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఇందులో శ్రీలంక 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఆదివారం కేప్‌టౌన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు గేమ్ ఛేంజర్‌లుగా నిరూపించుకోగలరని తెలుస్తోంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో వీరిద్దరూ మంచి ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే.
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ షఫాలీ వర్మ, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ ఈ మార్క్యూ ఈవెంట్ కోసం జట్టులో చేరనున్నారు. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే క్రికెట్ ఆటలో కొన్ని అత్యంత చారిత్రాత్మకమైన, ఉత్కంఠభరితమైన క్షణాలను అందిస్తాయి.
గత కొన్ని రోజులుగా, స్మృతి, హర్మన్‌ప్రీత్ ఆడడంపై ఆందోళన నెలకొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ట్రై-సిరీస్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ ఎడమ భుజానికి గాయం కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో స్మృతి ఎడమ మధ్య వేలికి గాయమైంది. భారత్ ట్రోఫీని చేరుకోవాలంటే, షఫాలీ, రిచా, జెమిమా రోడ్రిగ్స్ నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. అలాగే హర్మన్‌ప్రీత్, స్మృతి నుంచి మద్దతు అవసరం. దీప్తి బ్యాట్, బాల్‌తో తన మంచి ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది.
బంతితో ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్, శిఖా పాండేల పాత్రలు కీలకం కానున్నాయి. స్పిన్నర్ల విషయానికొస్తే, దీప్తికి రాజేశ్వరి గైక్వాడ్, దేవికా వైద్య, పార్ట్ టైమ్ స్పిన్నర్లు, హర్మన్‌ప్రీత్, షఫాలీ అవసరం.
పాకిస్తాన్‌తో పాటు గ్రూప్ దశలో 2009 ఛాంపియన్‌లు ఇంగ్లండ్, 2016 విజేత వెస్టిండీస్, ఐర్లాండ్‌లతో కూడా తలపడాల్సి ఉంది. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లలో ప్రసారం కానున్నాయి. ఇవి హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో కూడా కవరేజీని అందిస్తాయి.
మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు..
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి సర్వాణి, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్‌వాడ్, రాజేశ్వరి గైక్‌వాడ్.
మహిళల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ జట్టు..
పాకిస్థాన్: బిస్మాహ్ మరూఫ్ (కెప్టెన్), ఐమన్ అన్వర్, అలియా రియాజ్, అయేషా నసీమ్, సదాఫ్ షమాస్, ఫాతిమా సనా, జవేరియా ఖాన్, మునీబా అలీ, నష్రా సంధు, నిదా దార్, ఒమిమా సొహైల్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సిద్రా నవాజ్, తుబా హసన్.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..