IND vs AUS: 10 ఏళ్లుగా తగ్గేదేలే.. దిగ్గజ టీంలకు దబిడ దిబిడే.. టెస్టుల్లో టీమిండియా తిరుగులేని రికార్డులు ఇవే..
Border-Gavaskar Trophy 2023: నాగ్‌పూర్ టెస్టులో భారత జట్టు ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్132 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో సొంతగడ్డపై మరో టెస్టులో టీమిండియా విజయం సాధించింది.
భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై టీమ్‌ఇండియా మరో ఘన విజయం సాధించింది. గత 10 ఏళ్లుగా స్వదేశంలో టెస్టు మ్యాచ్‌లు ఆడుతూ అత్యంత విజయవంతమైన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. గత 10 ఏళ్లలో స్వదేశంలో జరిగిన టెస్టుల్లో 81.4 శాతం విజయాలు సాధించింది. అదే సమయంలో, విదేశీ టెస్ట్ మ్యాచ్‌లలో జట్టు 38.9 శాతం విజయాలు సాధించింది.
గత 10 ఏళ్లలో టీమిండియాదే ఆధిపత్యం..
2013 నుంచి టెస్టుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ వంటి జట్లను భారత జట్టు ఓడించింది. అదే సమయంలో విదేశీ గడ్డపై ఆడుతున్న సమయంలో భారత జట్టు పలు జట్ల చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2013లో భారత్‌లో ఆడిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 4–0తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత, 2016-17లో దేశవాళీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మరోసారి ఆస్ట్రేలియాను 2-1తో ఓడించింది.
2023 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో విజయం..
విశేషమేమిటంటే, ఈ ఏడాది ఆడే దేశవాళీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మరోసారి టీమిండియా ఆధిపత్యం కనబరుస్తోంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు మూడో రోజునే ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 177 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకు ఆలౌటైంది.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..