India vs Pakistan, Asian Games Final Highlights: ఉత్కంఠ పోరులో గెలిచిన భారత్.. వరుసగా 2వసారి గోల్డ్ మెడల్
IND vs PAK Asian Games Final Highlights in Telugu: ఫైనల్లో పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి, భారత్ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 192 పరుగులు మాత్రమే చేయగలిగింది.

IND vs PAK Asian Games Final Live Score Updates in Telugu: ఫైనల్లో పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి, భారత్ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 192 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పాకిస్థాన్ తరపున హసన్ నవాజ్ 96 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సైమ్ అయూబ్ 29 పరుగులు చేశాడు. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలా రెండు వికెట్లు పడగొట్టారు.
పాకిస్థాన్‌పై భారత్ అత్యధిక స్కోరు
టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. 2012లో అహ్మదాబాద్‌లో భారత్ నెలకొల్పిన 192/5 స్కోరు మునుపటి రికార్డుగా ఉండేది.
భారత్ తరఫున, ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 7 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 22 బంతుల్లో 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.
ఇరుజట్లు..
భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్తాన్ ప్లేయింగ్ XI: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాకత్, హసన్ నవాజ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మోకిమ్.
LIVE Cricket Score & Updates
-
IND vs PAK: ఉత్కంఠ పోరులో గెలిచిన భారత్.. వరుసగా 2వసారి గోల్డ్ మెడల్
భారత జట్టు ఘన విజయం సాధించింది.
-
5వ వికెట్ డౌన్.. పాక్ స్కోర్ 162/5
5వ వికెట్ కోల్పోయిన పాక్ జట్టు 162/5గా నిలిచింది.
-
-
ఉత్కంఠగా మ్యాచ్.. పాక్ స్కోర్ 106/4
17 ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. పాక్ విజయం సాధించాలంటే మరో 18 బంతుల్లో 52 పరుగులు కావాల్సింది.
-
4వ వికెట్ డౌన్.. బ్రేకిచ్చిన దుబే.. పాక్ స్కోర్ 153/4
14. 1వ ఓవర్లో టీమిండియాకు దుబే బ్రేకిచ్చాడు. ఆయూబ్ వికెట్ తీసి 87 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు.
-
ఒక్క ఓవర్లో 20 పరుగులు.. రిజల్ట్ మార్చే ఓవర్ ఇదేనా?
రవి బిష్ణోయ్ వేసిన 13వ ఓవర్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించేలా మారింది. ఈ ఓవర్లో పాక్ ప్లేయర్లు 20 పరుగులు రాబట్టారు.
-
-
13 ఓవర్లకు పాక్ 117/3
13 ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
-
IND vs PAK: 4వ వికెట్ తీసే బౌలర్ ఎవరు? అయ్యర్ ప్లాన్స్ ఏంటి?
3 వికెట్లు తీసిన తర్వాత భారత బౌలర్లు తేలిపోయారు. 4వ వికెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఈలోపు పాక్ ప్లేయ్లు నవాజ్ 28, ఆయుబ్ 22 పరుగులతో క్రీజులో పాతుకుపోయారు. అభిషేక్, రవి బిష్ణోయ్‌ని బరిలోకి దింపినా, అయ్యర్ ప్లాన్స్ వర్క్ట్ కాలేదు.
-
IND vs PAK: 10 ఓవర్లకు పాక్ 76/3
10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ టీం 76 పరుగులు చేసింది. పాక్ విజయానికి మరో 60 బంతుల్లో 136 పరుగులు చేయాల్సి ఉంది.
-
IND vs PAK: 3వ వికెట్ కోల్పోయిన పాక్.. స్కోర్ 39
6.1 ఓవర్లలో పాక్ జట్టు 3 వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 39 పరుగులు చేసింది.
-
IND vs PAK: 2వ వికెట్ కోల్పోయిన పాక్..
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పాకిస్తాన్ తన రెండో వికెట్ కోల్పోయింది. దీంతో పాక్ జట్టు 4.5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది
-
IND vs PAK: తొలి వికెట్ కోల్పోయిన పాక్.. బ్రేకిచ్చిన సుందర్
తొలి వికెట్ కోల్పోయిన పాక్.. బ్రేకిచ్చిన సుందర్
-
బుమ్రా బౌలింగ్‌లో పాక్ ఓపెనర్ల తడబాటు
3 ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు 24 పరుగులు చేసింది.
-
ముగిసిన తొలి ఓవర్.. పాక్ 11 పరుగులు
తొలి ఓవర్ ముగిసే సరికి భారత జట్టు 11 పరుగులు చేసింది. ఈ ఓవర్లో బుమ్రా రెండు నోబాల్స్ వేయడం గమనార్హం.
-
IND vs PAK Records: అభిషేక్, తిలక్ వర్మ దూకుడు.. బద్దలైన రికార్డులు ఇవే..
పాకిస్థాన్‌పై టీ20ల్లో భారత్ అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్లు..
211/6 – నిస్సిన్, 2026, నేడు*
192/5 – అహ్మదాబాద్, 2012
181/7 – దుబాయ్, 2022
టీ20ల్లో పాకిస్థాన్‌పై అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్లు..
226/8 – న్యూజిలాండ్, ఆక్లాండ్, 2024
224/7 – న్యూజిలాండ్, డునెడిన్, 2024
221/3 – ఇంగ్లాండ్, కరాచీ, 2022
220/6 – న్యూజిలాండ్, మౌంట్ మాంగనూయి, 2025
211/3 – శ్రీలంక, దుబాయ్, 2013
211/6 – భారత్, నిస్సిన్, 2026, నేడు*
టీ20ల్లో పాకిస్థాన్‌పై అత్యధిక 6వ వికెట్ భాగస్వామ్యాలు..
81* – మార్కస్ స్టోయినిస్ & మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా), దుబాయ్, 2021
71 – డ్వేన్ బ్రావో & డారెన్ సామీ (వెస్టిండీస్), మిర్పూర్, 2014
67* – ఇయాన్ మోర్గాన్ & మైఖేల్ యార్డీ (ఇంగ్లాండ్), కార్డిఫ్, 2010
62 – శివమ్ దూబే & తిలక్ వర్మ (భారత్), నిస్సిన్, 2026, నేడు*
61 – పవన్ రత్నాయకే & దసున్ శనక (శ్రీలంక), పల్లెకెలె, 2026
టీ20 అంతర్జాతీయ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు
8 – సంజూ శాంసన్ vs న్యూజిలాండ్, అహ్మదాబాద్, 2026 (టీ20 ప్రపంచకప్)
7 – అభిషేక్ శర్మ vs పాకిస్థాన్, నిస్సిన్, 2026 (ఆసియా క్రీడలు), నేడు*
4 – విరాట్ కోహ్లీ vs శ్రీలంక, మిర్పూర్, 2014 (టీ20 ప్రపంచకప్)
4 – అక్షర్ పటేల్ vs దక్షిణాఫ్రికా, బ్రిడ్జ్‌టౌన్, 2024 (టీ20 ప్రపంచకప్)
4 – తిలక్ వర్మ vs పాకిస్థాన్, దుబాయ్, 2025 (ఆసియా కప్)
4 – ఇషాన్ కిషన్ vs న్యూజిలాండ్, అహ్మదాబాద్, 2026 (టీ20 ప్రపంచకప్)
4 – తిలక్ వర్మ vs పాకిస్థాన్, నిస్సిన్, 2026 (ఆసియా క్రీడలు), నేడు*
టీ20ల్లో పాకిస్థాన్‌పై భారత్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీలు..
20 బంతులు – అభిషేక్ శర్మ, నిస్సిన్, 2026, నేడు*
21 బంతులు – తిలక్ వర్మ, నిస్సిన్, 2026, నేడు*
24 బంతులు – అభిషేక్ శర్మ, దుబాయ్ (DICS), 2025
29 బంతులు – యువరాజ్ సింగ్, అహ్మదాబాద్, 2012
టీ20 నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక 50+ స్కోర్లు..
5 – విరాట్ కోహ్లీ
3 – తిలక్ వర్మ*
2 – సంజూ శాంసన్
2 – రోహిత్ శర్మ
2 – ఇషాన్ కిషన్
2 – అభిషేక్ శర్మ*
-
IND vs PAK: పాక్ టార్గెట్ 212
పాకిస్థాన్‌తో ఆసియా పురుషుల టీ20 2026 ఫైనల్లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులతో దూకుడుగా ఆడగా, తిలక్ వర్మ 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
-
6వ వికెట్ డౌన్..
శివం దుబే 27 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
-
18 ఓవర్లకు..
18 ఓవర్లకు భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.
-
16 ఓవర్లకు భారత్..
16 ఓవర్లకు భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.
-
5వ వికెట్ కోల్పోయిన భారత్..
శ్రేయాస్ అయ్యర్ 21 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.
-
IND vs PAK: 4వ వికెట్ కోల్పోయిన భారత్..
ఇషాన్ కిష్ 20 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
-
12 ఓవర్లకు..
12 ఓవర్లకు భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. అయ్యర్ 17, ఇషాన్ 19 పరుగులతో నిలిచారు.
-
10 ఓవర్లకు..
10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయ 114 పరుగులు చేసింది.
-
IND vs PAK: 3 వికెట్ కోల్పోయిన భారత్..
అభిషేక్ శర్మ 61 పరుగులు చేసిన తర్వాత స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది.
-
Abhishek Sharma: అభిషేక్ హాఫ్ సెంచరీ
టీ20ఐలలో భారత్ vs పాకిస్థాన్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ (బంతుల వారీగా): 20 – అభిషేక్ శర్మ, నిస్షిన్, 2026, ఈరోజు*
24 – అభిషేక్ శర్మ, దుబాయ్ (DICS), 2025
29 – యువరాజ్ సింగ్, అహ్మదాబాద్, 2012
-
IND vs PAK: 5 ఓవర్లకు..
5 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. అభిషేక్ 40 పరుగులతో క్రీజులో నిలిచాడు. ఈ క్రమంలో పాక్ ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు మిస్ చేశారు.
-
IND vs PAk Record Alert: అత్యంత ఖరీదైన ఓవర్..
ఈరోజు సాద్ మసూద్ వేసిన రెండో ఓవర్లో 24 పరుగులు రావడం, భారత్-పాకిస్తాన్ టీ20ఐ మ్యాచ్‌లలో అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది. ఇది 2012లో అహ్మదాబాద్‌లో సయీద్ అజ్మల్ ఇచ్చిన 22 పరుగుల పాత రికార్డును అధిగమించింది. ఆ 19వ ఓవర్లో యువరాజ్ సింగ్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు.
-
IND vs PAK: రెండో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్..
రెండో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్..
-
ఫాస్టెస్ట్ 400 సిక్స్‌లు బాదిన ప్లేయర్లు..
వేగంగా 400 సిక్స్‌లు బాదిన టీమిండియా ప్లేయర్లలో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే..
208 – అభిషేక్ శర్మ*
317 – సంజూ శాంసన్
322 – సూర్యకుమార్ యాదవ్
342 – రోహిత్ శర్మ
371 – విరాట్ కోహ్లీ
-
IND vs PAK Live Score: 3 ఓవర్లకు..
3 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. అభిషేక్ 25 పరుగులతో క్రీజులో నిలిచాడు.
-
IND vs PAK: వైభవ్ సూర్యవంశీ ఔట్
వైభవ్ సూర్యవంశీ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇందులో రెండు సిక్స్‌లు ఉన్నాయి.
-
IND vs PAK: 6,6,1,6,4
రెండో ఓవర్లో వైభవ్, అభిషేక్ వరుస బౌండరీలతో దడ పుట్టించారు. దీంతో 2 వ ఓవర్ ముగిసే సరికి భారత జట్టు 28 పరుగులు చేసింది.
-
IND vs PAK: తొలి సిక్స్ బాదిన వైభవ్..
రెండో ఓవర్ రెండో బంతికి వైభవ్ సూర్యవంశీ భారీ సిక్స్ బాదాడు.
-
IND vs PAK Asian Games 2026 Final Live Score: తొలి ఓవర్లో 4 పరుగులు
తొలి ఓవర్ ముగిసే సరికి భారత జట్టు 4 పరుగులతో నిలిచింది. వైభవ్ 2, అభిషేక్ 1 పరుగుతో క్రీజులో నిలిచారు.
-
India vs Pakistan Live: ఓపెనర్లుగా వైభవ్, అభిషేక్..
టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో ఎలాంటి మార్పులేదు. ఓపెనర్లుగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు.
-
Pakitan Playing XI: పాకిస్తాన్ జట్టు ఇదే
పాకిస్తాన్ ప్లేయింగ్ XI: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాకత్, హసన్ నవాజ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మోకిమ్.
-
Asian Games 2026 Final Live: టీ20ల్లో భారత్ తరపున అత్యధిక మ్యాచ్‌లాడిన ప్లేయర్లు..!
159 – రోహిత్ శర్మ
138 – హార్దిక్ పాండ్యా
125 – విరాట్ కోహ్లీ
113 – సూర్యకుమార్ యాదవ్
107 – అక్షర్ పటేల్*
100 – జస్ప్రీత్ బుమ్రా*
జస్ప్రీత్ బుమ్రా తన 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ ఘనత సాధించిన మొత్తం 71వ ఆటగాడు మరియు ఆరో భారతీయ ఆటగాడు అతనే.
-
India Playing 11: భారత జట్టు ఇదే
భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా.
-
India vs pakistan toss winner asia cup: టాస్ గెలిచిన భారత్
టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ టీం బౌలింగ్ చేయనుంది.
-
India vs pakistan toss winner asia cup: మొహ్సిన్ నఖ్వీ దూరం
ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) పురుషుల క్రికెట్ స్వర్ణ పతక పోరుకు భారత్, పాకిస్థాన్ సిద్ధమవుతున్న వేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) గైర్హాజరు కానున్నారు.
-
India vs Pakistan Asian Games 2026 final live: వాతావరణం ఎలా ఉందంటే?
శనివారం నిస్షిన్లో వాతావరణం స్పష్టంగా ఉంటుందని అంచనా. వర్షం పడే అవకాశం 10 శాతం ఉంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని అంచనా. సెమీఫైనల్స్‌లో పిచ్ టర్న్, బౌన్స్‌కు అనుకూలించగా, ఫైనల్ కూడా బౌలర్లకు అదే విధమైన సహాయాన్ని అందించే అవకాశం ఉంది.
-
Asian Games Cricket Final: బలమైన బౌలింగ్ లైనప్
బౌలింగ్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తాడు. అతను గత మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ కూడా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
-
IND vs PAK Final 2026: బరిలోకి వైభవ్..?
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెమీఫైనల్లో శ్రీలంకపై 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఇషాన్ కిషన్ కూడా 173.91 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 80 పరుగులు చేశాడు.
-
13సార్లు ఓడిన పాక్
భారత్, పాకిస్తాన్ ఇప్పటివరకు 17 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. భారత్ 13 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్తాన్ 3 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది.
-
నో హ్యాండ్ షేక్
మ్యాచ్‌కు ముందు తలెత్తిన అతిపెద్ద ప్రశ్న ఇరు జట్ల మధ్య కరచాలనం గురించే. గత 383 రోజులుగా, ఆరు మ్యాచ్‌లుగా భారత పురుషుల, మహిళల క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ దాడి అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 సెప్టెంబర్‌లో జరిగే పురుషుల ఆసియా కప్‌తో కరచాలనం చేయరాదనే విధానం ప్రారంభమైంది.
-
Asian Games 2026 Cricket Final Live Updates: భారత జట్టుదే ఆధిపత్యం
ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్ నేడు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఆరు టీ20ఐలలో ప్రతీదానిలోనూ భారత్ విజయం సాధించింది. 2022 ఆసియా కప్‌లో పాకిస్తాన్ చివరిసారిగా భారత్‌ను ఓడించింది.
-
ప్లేయింగ్ 11పైనే ఫోకస్?
భారత్ సెమీఫైనల్లో శ్రీలంకను 124 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. పాకిస్థాన్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. రెండు జట్లు టోర్నీలో ఇప్పటివరకు ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాయి.
Published On - Oct 03,2026 7:50 AM




