IND vs NZ: కివీస్‌తో టీ20 సిరీస్.. నేడు వెల్లింగ్టన్‌లో మొదటి మ్యాచ్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
వెల్లింగ్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని హార్దిక్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది భారత జట్టు. ఈ పరాజయం నుంచి త్వరగా కోలుకోవాలని భావిస్తోన్న టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్‌తో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం (నవంబర్ 18) హార్దిక్ పాండ్యా సారథ్యంలో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్‌లో జట్టులోని సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అదే సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకున్నారు. వెల్లింగ్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని హార్దిక్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇక జట్టు గురించి కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ‘ వచ్చే టీ20 ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కొత్త ప్రతిభను కనుగొనడానికి మాకు చాలా సమయం ఉంది. చాలా మంది ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తాయి. సీనియర్ ఆటగాళ్లు ఈ టూర్‌లో లేకపోయినా మా శక్తిమేర రాణిస్తాం. అవకాశాలను అందిపుచ్చుకుని సత్తా చాటేందుకు కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారు’ అని చెప్పుకొచ్చాడు.
ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కాగాఈ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ లేని వారు మ్యాచ్ చూడలేమని చింతించాల్సిన అవసరం లేదు. డీడీస్పోర్ట్స్‌లోనూ ఈ మ్యాచ్‌లు లైలవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్ ఫ్రీగా ఈ మ్యాచ్‌లు వీక్షించొచ్చు. ఈ విషయాన్ని డీడీ స్పోర్ట్స్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 11.30 గంటలకు టాస్ వేస్తారు.
#TeamIndia marches on? Up next is a visit of New Zealand that will begin tomorrow ?#NZvIND? LIVE on DD Free Dish? pic.twitter.com/fIPCHRaLHu
— Doordarshan Sports (@ddsportschannel) November 17, 2022
జట్ల వివరాలివే
భారత్:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ , ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వైస్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ ), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్‌దీప్ యాదవ్ , హర్షల్ పటేల్, మొహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ , ఉమ్రాన్ మాలిక్
న్యూజిలాండ్:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే , జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ , ఇష్ సోధి , టిమ్ సౌథీ , టిమ్ సౌతీ
Catch all the LIVE action of #NZvIND T20I series on DD Sports (DD Free Dish) ? https://t.co/UMGkip1xqg
— Doordarshan Sports (@ddsportschannel) November 17, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..