రెండు గంటల్లో తేలనున్న మ్యాచ్ భవితవ్యం!

మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టేడియంలో మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఇక వర్షం తగ్గిన తర్వాత గ్రౌండ్‌ను డ్రై చేసేందుకు గంట సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా చూస్తే మ్యాచ్ రెండు గంటల ఆలస్యంగా మొదలైయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే అంపైర్లు రెండు గంటల తర్వాత మ్యాచ్ కొనసాగింపు‌పై ఓ నిర్ణయానికి వస్తారు. అయితే మ్యాచ్ ఫలితం […]

రెండు గంటల్లో తేలనున్న మ్యాచ్ భవితవ్యం!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 09, 2019 | 8:46 PM

మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టేడియంలో మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఇక వర్షం తగ్గిన తర్వాత గ్రౌండ్‌ను డ్రై చేసేందుకు గంట సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా చూస్తే మ్యాచ్ రెండు గంటల ఆలస్యంగా మొదలైయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే అంపైర్లు రెండు గంటల తర్వాత మ్యాచ్ కొనసాగింపు‌పై ఓ నిర్ణయానికి వస్తారు. అయితే మ్యాచ్ ఫలితం తేలాలంటే మాత్రం భారత్ 20 ఓవర్లు ఆడక తప్పదు. కాగా ఒకవేళ వర్షం తగ్గకపోతే ఇవాళ ఆట ఆగిపోయిన దగ్గర నుంచి రేపు ప్రారంభం కానుంది.