IND vs NZ 1st ODI: రేపే ఉప్పల్‌లో వన్డే మ్యాచ్.. పోలీసుల భారీ భద్రత.. గ్రౌండ్‌లోకి వస్తే తాటతీసుడే అంటోన్న రాచకొండ సీపీ..
IND vs NZ Hyderabad Traffic Restrictions: ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులకు ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేశారు. ప్లేయర్స్ వచ్చే గేట్ నుంచి వేరేవరికి అనుమతి ఉండదని సీపీ తెలిపారు.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రేపు టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దాదాపు 2500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ డీసీ చౌహన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, వన్డే మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియం లోపలికి ఎంట్రీ చేస్తామని ఆయన తెలిపారు.
ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులకు ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేశారు. ప్లేయర్స్ వచ్చే గేట్ నుంచి వేరేవరికి అనుమతి ఉండదని సీపీ తెలిపారు. ఇక రూల్స్ అతిక్రమించి, ఎవరైనా మైదానంలోకి వెళ్తే.. కఠిన శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మహిళా అభిమానుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. లేడీస్‌తో తప్పుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.




టికెట్ల విషయంలో మోసపోవద్దని, బ్లాక్ టికెట్స్ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే బ్లాక్ టికెట్స్ మోసాలపై 3 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. గేట్ నెంబర్ 1 నుంచి వీఐపీలకు మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు.




