AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ, 1st Test: టాస్ గెలిచిన టీమిండియా.. తొలి టెస్ట్ ఆడనున్న శ్రేయాస్ అయ్యర్.. యంగ్ ప్లేయర్లకు సువర్ణావకాశం..!

కాన్పూర్‌లో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచులో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IND vs NZ, 1st Test: టాస్ గెలిచిన టీమిండియా.. తొలి టెస్ట్ ఆడనున్న శ్రేయాస్ అయ్యర్.. యంగ్ ప్లేయర్లకు సువర్ణావకాశం..!
India Vs New Zealand, 1st Test
Follow us
Venkata Chari

|

Updated on: Nov 25, 2021 | 9:13 AM

India vs New Zealand, 1st Test: కాన్పూర్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్‌లో భాగంగా ఈ సిరీస్‌ జరగనుంది. ఈ మ్యాచులో భారత సారథి అజింక్య రహానే టాస్ గెలిచాడు. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్ భారత జట్టు బ్యాటింగ్ డెప్త్‌కు మంచి పరీక్షగా నిలవనుంది. ఎందుకంటే టీమిండియా ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్స్ లేకుండా పోటీలో నిలవనున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌పై చాలా భారం నెలకొంది. మూడో స్థానంలో ఉన్న చెతేశ్వర్ పుజారా ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక ఓపెనింగ్‌లో మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. మరోవైపు, సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా పరిగణించిన కాన్పూర్‌లో శ్రేయాస్ అయ్యర్ తన టెస్టు అరంగేట్రం చేయబోతున్నాడు. అయితే బ్యాటింగ్‌లో అనుభవం మాత్రం కరువైంది. రహానే, పుజారా, మయాంక్ అగర్వాల్ మాత్రమే 10 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. మిగిలిన వారంతా టెస్ట్ క్రికెట్‌కు కొత్తే. కానీ, ఆటగాళ్లలో ప్రతిభ ఎంతో ఉంది. స్వంత గడ్డపై వారు కివీస్ బౌలర్లను అధిగమించి, రాణించాలని కోరుకుంటున్నారు.

2016లో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు 0-3 తేడాతో కోల్పోయింది. అయితే ఆ ఓటమి నుంచి ఈ జట్టు గుణపాఠం నేర్చుకోక తప్పదు. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్ ఈ జట్టుకు బలం. ఈ ముగ్గురు అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ విజయాన్ని నిర్ణయించగలరు. అదే సమయంలో, టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్, కైల్ జేమ్సన్ బౌలింగ్‌లో పెద్ద ముప్పుగా నిరూపించగలరు. స్పిన్ విభాగంలో ఎజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్‌లు రంగంలోకి దిగవచ్చు. అలాగే, కివీ జట్టు ఆఫ్ స్పిన్నర్ విలియం సోమర్‌విల్లేను ప్రయత్నించవచ్చు. మొత్తంమీద, కివీ జట్టు సమతుల్యంగా ఉంది. కాన్పూర్‌లో అద్భుతాలు చేసేందుకు ఆరాటపడుతోంది.

ప్లేయింగ్ XI: న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్‌విల్లే భారత్ (ప్లేయింగ్ XI): శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్

Also Read: IND vs NZ: స్వదేశంలో తొలి WTC సిరీస్‌ ఆడనున్న భారత్.. పాయింట్ల పట్టికలో ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?

IND vs NZ 1st Test Preview, Playing XI: డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రతీకారానికి సిద్ధమైన భారత్.. నేటి నుంచి కాన్పూర్‌లో తొలిటెస్ట్