IND vs NZ 1st Test, Day 1 Highlights: తొలి రోజు ముగిసిన ఆట… హాఫ్ సెంచరీలతో రాణించిన జడేజా, శ్రేయస్..
India vs New Zealand 1st Test Day 1 Live Score Updates: భారత్ చేతిలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుతం దానిని టెస్ట్ సిరీస్‌లో భర్తీ చేయడానికి ప్రయత్నించేందుకు కివీస్ బరిలోకి దిగనుంది.
India vs New Zealand 1st Test Day 1 Highlights: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పూర్తయింది. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరగుల వద్ద ఉంది. ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు మయాంక్ అగర్వాల్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. 21 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం వచ్చిన శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 79 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేసి జట్టు స్కోరును పెంచాడు.
అయితే అర్థ సెంచరీ చేసిన వెంటనే 52 పరుగల వద్ద జైమిషన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం ఛెతేశ్వర పూజారా 26 పరుగుల వద్ద సౌతీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి 2వ సెషన్‌లో టీమిండియా 127 పరగులు మాత్రమే చేసింది. తర్వాత రహానే కూడా 35 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇలా 145 పరగుల వద్దే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఈ సమయంలో క్రీజులోఉన్న శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా దూకుడుగా ఆడారు. ఆచితూచి ఆడుతూనే అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచారు. ఈ క్రమంలోనే 208 బంతుల్లో వీరిద్దరి పాట్నర్ షిప్ 113 పరుగులకు చేరింది. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరగుల వద్ద ఉంది. ప్రస్తుతం క్రీజులో జడేజా (50), శ్రేయస్ అయ్యర్ (75) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
LIVE Cricket Score & Updates
-
ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ మ్యాచ్ తొలి రోజు పూర్తయింది. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరగుల వద్ద ఉంది. ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు మయాంక్ అగర్వాల్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. 21 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం వచ్చిన శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 79 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేసి జట్టు స్కోరును పెంచాడు. అయితే అర్థ సెంచరీ చేసిన వెంటనే 52 పరుగల వద్ద జైమిషన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం ఛెతేశ్వర పూజారా 26 పరుగుల వద్ద సౌతీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సమయానికి 2వ సెషన్‌లో టీమిండియా 127 పరగులు మాత్రమే చేసింది. తర్వాత రహానే కూడా 35 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇలా 145 పరగుల వద్దే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఈ సమయంలో క్రీజులోఉన్న శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా దూకుడుగా ఆడారు. ఆచితూచి ఆడుతూనే అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచారు. ఈ క్రమంలోనే 208 బంతుల్లో వీరిద్దరి పాట్నర్ షిప్ 113 పరుగులకు చేరింది. తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరగుల వద్ద ఉంది. ప్రస్తుతం క్రీజులో జడేజా (50), శ్రేయస్ అయ్యర్ (75) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.
-
అర్థ శతకం పూర్తి చేసుకున్న జడేజా..
జట్టును స్కోరును పెంచే పనిలో పడ్డ జడేజా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 99 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులను సాధించాడు రవీంద్ర జడేజా. ప్రస్తుతం టీమిండియా స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 252 పరుగుల వద్దకొనసాగుతోంది. ఇక క్రీజులో శ్రేయస్ అయ్యర్ (69), రవీంద్ర జడేజా (50)పరుగులతో కొనసాగుతున్నారు.
-
-
250 మార్కు దాటేసిన టీమిండియా..
న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో టాప్ ఆర్డర్ కాస్త తడబడిన తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నారు. ఆచితూచి ఆడుతూ అవకాశం దొరికినప్పుడల్లా పరుగులు రాబడుతున్నారు. ఈక్రమంలోనే టీమిండియా స్కోరు 250 పరుగుల మార్కును చేరుకుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి పాట్నర్‌షిప్ 106 పరుగులకు చేరుకుంది.
-
200 మార్కును దాటేసిన టీమిండియా స్కోర్..
మొదట్లో వికెట్లు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, జడేజా రూపంలో మంచి స్టాండింగ్ దొరికింది. ఈ క్రమంలో ఆచిచూతి ఆడుతూ జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు ఈ ప్లేయర్స్. ఈ క్రమంలోనే టీమిండియా స్కోరు 200 మార్కును దాటేసింది. ప్రస్తుతం టీమీండియా స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఇక క్రీజులో శ్రేయన్ అయ్యర్ (54), రవీంద్ర జడేజా (21) పరుగులతో కొనసాగుతున్నారు.
-
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్..
తొలి టెస్ట్‌లో భాగంగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. అయితే శ్రేయస్ అయ్యర్, జడేజా రూపంలో మంచి భాగస్వామ్యం దక్కిందని చెప్పాలి. జట్టు స్కోరు పెంచే క్రమంలో వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. 94 బంతుల్లో 50 పరుగులు సాధించి మంచి స్టాండింగ్ ఇచ్చాడు.
-
-
టీ విరామానికి టీమిండియా స్కోర్..
టీమిండియా రెండు సెషన్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 154 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 17, రవీంద్ర జడేజా 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మయాంక్ 13, శుభ్మన్ గిల్ 52, పుజరా 26, రహానే 35 పరుగులతో పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ బౌలర్లలో కేల్ జేమీసన్ 3, టిమ్ సౌతీ 1 వికెట్లు పడగొట్టారు.
-
150 పరుగులకు చేరిన టీమిండియా స్కోర్..
టీమిండియా దాదాపు రెండో ఇన్నింగ్స్ చివర్లో అంటే 53 ఓవర్లో 150 పరుగులకు చేరింది. 4 వికెట్లు కోల్పోయిన భారత్.. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 15, రవీంద్ర జడేజా 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మయాంక్ 13, శుభ్మన్ గిల్ 52, పుజరా 26, రహానే 35 పరుగులతో పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ బౌలర్లలో కేల్ జేమీసన్ 3, టిమ్ సౌతీ 1 వికెట్లు పడగొట్టారు.
-
కెప్టెన్ అజింక్య రహానే ఔట్..
టీమిండియా సారథి అజింక్య రహానే(35 పరుగులు, 63 బంతులు, 6 ఫోర్లు) నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్ బౌలర్ కైల్ జైమీసన్ మూడు వికెట్లతో టీమిండియాను దెబ్బ తీశాడు. ప్రస్తుతం టీమిండియా 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు సాధించింది.
-
120 దాటిన టీమిండియా స్కోర్..
లంచ్ తరువా వెంటనే హాఫ్ సెంచరీ చేసిన గిల్ పెవిలియన్ చేరాడు. అనంతరం పుజారా భారీ ఇన్నింగ్స్ ఆడకుండానే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో కెప్టెన్ రహానే(24), శ్రేయాస్ అయ్యర్(7) కీలక భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 45 ఓవర్లు ముగిసే సరికి 2 వ సెషన్‌లో 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.
-
మూడో వికెట్ డౌన్..
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఛెతేశ్వర పుజారా 26 పరుగులు (88 బంతులు, 2 ఫోర్లు) చేసిన తరువాత సౌతీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
-
రెండో వికెట్ డౌన్..
అర్థసెంచరీ పూర్తి చేసిన టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్(52 పరుగులు, 93 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్) లంచ్ తరువాత పెవిలియన్ చేరాడు. జైమిషన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
-
లంచ్ బ్రేక్..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా లంచ్ సమయానికి ఒక వికెట్ నష్టపోయి 82 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (13) వికెట్ త్వరగానే టీమిండియా కోల్పోయింది. శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతూ టీమిండియాకు మంచి స్కోర్‌ను అందించేందుకు తన వంతు సహాయపడ్డాడు. 87 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇది శుభ్మన్‌కు 4వ టెస్ట్ ఫిఫ్టీ. అలాగే పుజరాతో కలిసి రెండో వికెట్‌కు 127 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
FIFTY!
A well made half-century for @ShubmanGill off 81 deliveries. This is his 4th in Test cricket ??
Live – https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/dtergTWr9b
— BCCI (@BCCI) November 25, 2021
-
అర్థసెంచరీతో ఆకట్టుకున్న శుభ్మన్ గిల్..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి వికెట్(మయాంక్ అగర్వాల్ 13)ను త్వరగానే కోల్పోయింది. ఆ తరువాత శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతూ టీమిండియాకు మంచి స్కోర్‌ను అందించేందుకు తన వంతు సహాయపడ్డాడు. 79 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇది శుభ్మన్‌కు 4వ టెస్ట్ ఫిఫ్టీ. అలాగే పుజరాతో కలిసి రెండో వికెట్‌కు 111 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
-
అర్థసెంచరీ భాగస్వామ్యం..
శుభ్మన్ గిల్ 47, ఛతేశ్వర పుజరా 9 ఇద్దరు కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్‌కు 91 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
-
తొలి వికెట్ డౌన్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే జైమీషన్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. రెండు బౌండరీలతో ఆడుతోన్న మయాంక్ అగర్వాల్ 13 పరుగుల వద్ద బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 7.5 ఓవర్లకు 21 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది.
-
ఓపెనర్లుగా గిల్, మయాంక్‌లు
ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. మరోవైపు గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా తొలి టెస్టుకు అందుబాటులో లేడు. ఇలాంటి పరిస్థితిలో ఓపెనింగ్ బాధ్యతలు మయాంక్ అగర్వాల్, శుభమాన్ గిల్ భుజాలపై నిలిపారు. వీరిద్దరూ జట్టుకు ఘనమైన ఆరంభాన్ని ఇస్తారనే ఆశతో టీమిండియా ఉంది.
-
న్యూజిలాండ్‌కు ప్లేయింగ్ XI
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, కైల్ జేమ్సన్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విల్ సోమర్‌విల్లే.
With the ball first in Kanpur after a toss win for India. Welcome to Test cricket Rachin Ravindra! The young @cricketwgtninc star is Test cap #282. Follow play LIVE in NZ with @skysportnz and @SENZ_Radio. #INDvNZ pic.twitter.com/irtqHePaoP
— BLACKCAPS (@BLACKCAPS) November 25, 2021
-
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్
భారత జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభమాన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ మరియు ఇషాంత్ శర్మ.
#TeamIndia Playing XI for the 1st Test at Kanpur.
Shreyas Iyer is all set to make his Test debut.
Live – https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/K55isD6yso
— BCCI (@BCCI) November 25, 2021
-
శ్రేయాస్ అయ్యర్ అరంగేట్రం..
ఈ మ్యాచ్‌లో టీమిండియా నుంచి ఓ ఆటగాడు అరంగేట్రం చేయనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ డెబ్యూ మ్యాచు క్యాప్‌ను ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అందించారు.
? A moment to cherish for @ShreyasIyer15 as he receives his #TeamIndia Test cap from Sunil Gavaskar – one of the best to have ever graced the game. ? ?#INDvNZ @Paytm pic.twitter.com/kPwVKNOkfu
— BCCI (@BCCI) November 25, 2021
-
టాస్ గెలిచిన భారత్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ అజింక్య రహానే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని భారత్ నిర్ణయించింది.
Published On - Nov 25,2021 9:25 AM