AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE 1st T20I : ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మొదటి టీ20.. అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

IND vs IRE 1st T20I : భారత్-ఐర్లాండ్ తొలి టీ20పై వర్షం ముప్పు నెలకొంది. బెల్ఫాస్ట్‌లో మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ ఓవర్లు తగ్గించే అవకాశం ఉండగా, వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.

IND vs IRE 1st T20I : ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మొదటి టీ20.. అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
Ind Vs Ire 1st T20i
Rakesh
|

Updated on: Jun 26, 2026 | 8:33 AM

Share

IND vs IRE 1st T20I : టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఎన్నో రకాల ప్రత్యేకతలతో క్రికెట్ అభిమానులను ఊరిస్తోంది. ముఖ్యంగా 15 ఏళ్ల యంగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్‎లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించేందుకు అంతా సిద్ధమైంది. మరోవైపు రాజస్థాన్‌కు చెందిన ఒక భారతీయ ప్లేయర్ ఐర్లాండ్ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు లైన్ క్లియర్ అయింది. ఇరు జట్ల మధ్య ఇవాళ బెల్ఫాస్ట్ వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌పై ప్రస్తుతం వాతావరణం రూపంలో ఒక పెద్ద నీలినీడలు కమ్ముకున్నాయి. భారీ వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగడం కష్టమేనని నివేదికలు వస్తున్నాయి.

మ్యాచ్ టైమింగ్స్, లైవ్ వివరాలు

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగే ఈ మొదటి టీ20 మ్యాచ్ మధ్యాహ్నం జరగనుంది. ఐర్లాండ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బెల్ఫాస్ట్ కాలమానానికి, భారత కాలమానానికి మధ్య నాలుగున్నర గంటల వ్యత్యాసం ఉంటుంది. దీని ప్రకారం భారతీయ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను మన దేశంలో ఇవాళ సాయంత్రం 6:00 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

మ్యాచ్ వేదిక, స్టేడియం కెపాసిటీ

ఈ తొలి టీ20 మ్యాచ్ బెల్ఫాస్ట్‌లోని ప్రతిష్టాత్మక సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో జరగనుంది. ఈ మైదానాన్ని స్థానికంగా స్టోర్‌మాంట్ క్రికెట్ గ్రౌండ్ అని కూడా పిలుస్తుంటారు. ఎంతో అందమైన వాతావరణం, పచ్చని ఔట్ ఫీల్డ్ కలిగి ఉండే ఈ స్టేడియం సిట్టింగ్ కెపాసిటీ చాలా తక్కువ. ఇందులో కేవలం 7 వేల మంది ప్రేక్షకులు మాత్రమే కూర్చుని మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు ఉన్నాయి.

బెల్ఫాస్ట్ లేటెస్ట్ వెదర్ అప్‌డేట్

ఇవాళ్టి వాతావరణ సూచన ప్రకారం బెల్ఫాస్ట్‌లో రోజంతా ఆకాశం పూర్తిగా నల్లటి మబ్బులతో మేఘావృతమై ఉంటుంది. అక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన తుఫాను గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్ ప్రారంభమయ్యే మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో వర్షం పడే అవకాశం దాదాపు 35 శాతంగా ఉంది. మధ్యాహ్నం అంతా ఎడతెరిపి లేకుండా జల్లులు పడే అవకాశం ఉందని, సాయంత్రం 4 గంటల తర్వాతే వాతావరణం కాస్త అనుకూలించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మ్యాచ్ పూర్తిగా రద్దవకపోయినా, ఓవర్లను తగ్గించి 10 లేదా 15 ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

భారత టీ20 జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా, సుయాష్ షెడ్గే.

ఐర్లాండ్ టీ20 జట్టు

లోర్కాన్ టక్కర్ (కెప్టెన్ & వికెట్ కీపర్), జార్జ్ డోక్రెల్, స్టీఫెన్ డోహెని (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, గారెత్ డెలానీ, బెన్ కాలరిడ్జ్, టిమ్ టెక్టర్, రాస్ అడైర్, మాథ్యూ హంఫ్రీస్, గోవిన్ హోయ్, లియామ్ మెక్‌కార్తీ, రూబెన్ విల్సన్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us