India vs England 2021 : ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు అంపైర్లు ముగ్గురూ భారతీయులే..
ఆస్ట్రేలియాతో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఇప్పడు ఇంగ్లాండ్ తో తలపడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఇండియా -ఇంగ్లాండ్ సిరీస్ కు అంపైరింగ్ బాధ్యతలను ముగ్గురు భారత అంపైర్ లు నిర్వహించనున్నారు.
India vs England 2021 : ఆస్ట్రేలియాతో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఇప్పడు ఇంగ్లాండ్ తో తలపడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఇండియా -ఇంగ్లాండ్ సిరీస్ కు అంపైరింగ్ బాధ్యతలను ముగ్గురు భారత అంపైర్ లు నిర్వహించనున్నారు. వీరిలో ఇద్దరు తొలిసారి టెస్ట్ మ్యాచ్ కు అంపైరింగ్ చేస్తున్నారు.
ఐసీసీ ఎమిరేట్స్ ప్యానెల్‌లో ఉన్న వీరేందర్ శర్మ, అనిల్ చౌదరి తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ చేయనున్నారు. వీరితోపాటు ఇండియా ఎలైట్ ప్యానెల్లో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ కూడా ఉన్నారు. కాగా నితిన్ గతంలో టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రయాణ సమస్యలు తలెత్తడంతో స్థానిక అంపైర్లకే ఐసీసీ కల్పించింది. ఇక భారత అంపైర్లలో నితిన్ మీననే మూడు టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ చేయగా.. అనిల్ చౌదరి 20 వన్డేలు, 28 టీ20ల్లో అంపైరింగ్ చేశాడు. ఇక వీరేందర్ శర్మ రెండు వన్డేలు, ఒక టీ20లో మాత్రమే అంపైరింగ్ చేసాడు .
మరిన్ని ఇక్కడ చదవండి :