ఆసుపత్రి నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ డిశ్చార్జ్.. మరి కొద్దిరోజులు విశ్రాంతి అవసరమంటున్న వైద్యులు..

గత కొంత కాలంగా గుండెనొప్పితో బాధపడుతున్న గంగూలీ కోలుకుని ఇంటికి చేరుకున్నారు. త్వరలో ఆయన పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారు.

ఆసుపత్రి నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ డిశ్చార్జ్.. మరి కొద్దిరోజులు విశ్రాంతి అవసరమంటున్న వైద్యులు..
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 31, 2021 | 12:52 PM

Sourav Ganguly discharged : భారత మాజీ ఆటగాడు, బీసీసీఐ ఆధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొంత కాలంగా గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన కోలుకుని ఇంటికి చేరుకున్నారు. త్వరలో ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారు. మూడు వారాల క్రితం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను పరిశీలించిన వైద్యులు తొలి యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. ఆ తరువాత ఇంటికి తిరిగివచ్చారు.

అయితే మళ్లీ గత బుధవారం చాతీలో నెప్పి రావడంతో హుటాహుటిన కోల్‌కతా అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న తరువాత కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవీ చెట్టి గంగూలీ రిపోర్టులను పరీక్షించి ఆయనకు మళ్లీ యాంజియోప్లాస్టీ సర్జరీ చేయాలని నిర్ధారించారు. ఇదే క్రమంలో గంగూలీకి డాక్టర్లు మరోసారి విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. రెండోసారి యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారు. గత నాలుగు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనను ఆదివారం డిశ్చార్జ్ చేసినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అయితే మరోసారి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మరికొద్ది రోజుల పాటు గంగూలీకి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఇంకొన్నాళ్లు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Read Also… India vs England 2021 : ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌‌‌‌కు అంపైర్లు ముగ్గురూ భారతీయులే..