ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా ‘ఖతర్నాక్’ ప్లేయింగ్ 11 ఇదే.. ఆర్డర్ చూస్తూ బౌలర్లు వణకాల్సిందే!

India vs England ODI Series: సమతూకమైన బ్యాటింగ్ ఆర్డర్, పదునైన బౌలింగ్ దళంతో కూడిన ఈ భారత జట్టు కాగితంపైనే కాకుండా మైదానంలోనూ అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఆరో నంబర్ వరకు యమగండాల్లాంటి బ్యాటర్లు ఉండటంతో ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. యువ రక్తం, అనుభవాల కలయికతో ఉన్న ఈ 'స్ట్రాంగెస్ట్ ఎలెవన్' ఇంగ్లాండ్ గడ్డపై లేదా స్వదేశంలోనైనా ఎలాంటి జట్టునైనా మట్టికరిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా ఖతర్నాక్ ప్లేయింగ్ 11 ఇదే.. ఆర్డర్ చూస్తూ బౌలర్లు వణకాల్సిందే!
India vs England

Updated on: Jun 23, 2026 | 9:45 AM

Team India Strongest XI: ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యంత పటిష్టమైన జట్టును సిద్ధం చేసింది. యువ సంచలనం శుబ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ తుది జట్టును చూస్తే ప్రత్యర్థి బౌలర్లకు నిద్రపట్టడం కష్టమేననిపిస్తోంది. ఓపెనింగ్ నుంచి ఆరో నంబర్ బ్యాటర్ వరకు ప్రతి ఒక్కరూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల వీరులే కావడం విశేషం.

గిల్ కెప్టెన్సీలో సరికొత్త సేన.. రోహిత్, విరాట్ అండ!

భారత జట్టు భవిష్యత్తు సారథిగా దూసుకుపోతున్న శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో ఈ వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారనుంది. గిల్‌కు తోడుగా అనుభవజ్ఞులైన రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ జట్టులో ఉండటం బ్యాటింగ్ విభాగానికి కొండంత అండగా మారింది. ఈ ముగ్గురు అగ్రశ్రేణి బ్యాటర్లు క్రీజులో సెట్ అయ్యారంటే ప్రత్యర్థి జట్టుకు పరుగుల వరద పారడం ఖాయం. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించే సత్తా ఉన్న ఈ త్రయం పరుగుల వేటలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.

ఆరో నంబర్ వరకు అందరూ ‘షేర్ ఖాన్’లే..

ఈ జట్టులోని అసలు సిసలైన బలం మిడిలార్డర్‌లో కనిపిస్తోంది. కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా, ఆరో స్థానం వరకు ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లే కావడం విశేషం. శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌తో పాటు యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి ఈ విభాగంలో కీలకం కానున్నారు. క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడగల సామర్థ్యం వీరి సొంతం. ముఖ్యంగా ఆరో స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుంది. ఈ ఆరుగురు బ్యాటర్ల విధ్వంసకర ఫామ్‌ను తట్టుకోవడం ఇంగ్లాండ్ బౌలింగ్ లైనప్‌కు పెను సవాలుగా మారనుంది.

ఇవి కూడా చదవండి

స్పిన్, పేస్ విభాగాల్లో తిరుగులేని బలం..

బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్ విభాగంలోనూ భారత్ అత్యంత సమతూకంతో కనిపిస్తోంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ప్రత్యర్థి బ్యాటర్లను తమ గింగిరాలు తిరిగే బంతులతో కట్టడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇక పేస్ గుర్రాల విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు ప్రధాన ఆయుధం. అతడికి తోడుగా ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్, పదునైన బంతులతో వికెట్లు తీయగల ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ఈ పేస్ త్రయం పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ ప్రత్యర్థులను పరుగుల కోసం ఊపిరి సలపకుండా చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us