IND vs ENG T20 WC Highlights: భారత బౌలింగ్ ధాటికి కుప్పకూలిన ఇంగ్లండ్.. 68 పరుగుల తేడాతో విజయం

|

Updated on: Jun 28, 2024 | 2:51 AM

India vs England, T20 world Cup 2024 Highlights: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది.

IND vs ENG T20 WC Highlights: భారత బౌలింగ్ ధాటికి కుప్పకూలిన ఇంగ్లండ్.. 68 పరుగుల తేడాతో విజయం
India Vs England

India vs England, T20 world Cup 2024 Highlights: టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో భారత్ 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. దీంతో ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. జూన్ 29న దక్షిణాఫ్రికాతో భారత్ టైటిల్ మ్యాచ్ ఆడనుంది.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టు 16.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు భారత్ అద్భుత విజయాన్ని అందించారు. అదే సమయంలో బౌలింగ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ బౌలింగ్‌ ముందు ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్స్ నిలువలేకపోయారు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ 57, సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేశారు. కాగా, బౌలింగ్‌లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో 3 ముఖ్యమైన వికెట్లు పడగొట్టి బ్రిటీష్ జట్టును మట్టికరిపించారు. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశాడు.

ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ జోష్ బట్లర్ 23 పరుగులు, హ్యారీ బ్రూక్ 25 పరుగులు, జోఫ్రా ఆర్చర్ 21 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా భారత బౌలర్లను ఎదుర్కొనలేకపోయాడు.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది.

కెప్టెన్ రోహిత్ శర్మ 57 పరుగులు చేశాడు. ఇది ప్రపంచకప్‌లో అతనికి మూడో అర్ధ సెంచరీ. సూర్యకుమార్ 47 పరుగులు, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 23 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్, కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 28 Jun 2024 02:50 AM (IST)

    ప్రతీకారం తీర్చుకున్న భారత్..

    గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో టీమిండియా ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. దీనికి తోడు గత ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన జట్టుగా ఫైనల్స్‌లోకి ప్రవేశించిన టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.

  • 28 Jun 2024 01:01 AM (IST)

    9 ఓవర్లలో 5 వికెట్లకు 53 పరుగులు

    ఇంగ్లండ్ 9 ఓవర్లలో 5 వికెట్లకు 53 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్ క్రీజులో ఉన్నారు.

    అక్షర్ పటేల్ జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టోలను పెవిలియన్‌కు పంపాడు. జస్ప్రీత్ బుమ్రా 5వ ఓవర్లో ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేశాడు.

  • 28 Jun 2024 12:25 AM (IST)

    2 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోర్..

    ఇంగ్లండ్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ క్రీజులో ఉన్నారు.

  • 28 Jun 2024 12:07 AM (IST)

    ఇంగ్లండ్ టార్గెట్ 172

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది.

    కెప్టెన్ రోహిత్ శర్మ 57 పరుగులు చేశాడు. ఇది ప్రపంచకప్‌లో అతనికి మూడో అర్ధ సెంచరీ. సూర్యకుమార్ 47 పరుగులు, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 23 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు.

  • 27 Jun 2024 11:51 PM (IST)

    హార్దిక్ ఔట్..

    17.4 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఈ క్రమంలో హార్దిక్ (23) రెండు భారీ సిక్సర్లు కొట్టి పెవిలియన్ చేరాడు.

  • 27 Jun 2024 11:33 PM (IST)

    రోహిత్ ఔట్

    14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది టీమిండియా. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. 57 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

  • 27 Jun 2024 11:27 PM (IST)

    రోహిత్ హాఫ్ సెంచరీ

    రోహిత్ శర్మ 36  బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

  • 27 Jun 2024 11:21 PM (IST)

    11 ఓవర్లకు

    11 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.

  • 27 Jun 2024 11:12 PM (IST)

    మొదలైన మ్యాచ్

    వర్షం ఆటంకం తర్వాత మ్యాచ్ మొదలైంది. క్రీజులో సూర్య, రోహిత్ ఉన్నారు.

  • 27 Jun 2024 11:07 PM (IST)

    IND vs ENG: మరికొద్దిపేపట్లో మ్యాచ్ ప్రారంభం..

    పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు, మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభించేందుకు సిగ్నల్ ఇచ్చారు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్ కూడా సిద్ధమయ్యారు.

  • 27 Jun 2024 10:07 PM (IST)

    వర్షంతో ఆగిన మ్యాచ్.. స్కోర్ ఎంతంటే?

    భారత జట్టు 50 పరుగుల వ్యవధిలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వికెట్లను కోల్పోయింది. మూడో ఓవర్‌లో రీస్ టాప్లీ బౌలింగ్‌లో కోహ్లి (9 పరుగులు) ఔటయ్యాడు. కాగా, పవర్‌ప్లే చివరి ఓవర్‌లో పంత్ (4 పరుగులు) సామ్ కుర్రాన్‌కు బలయ్యాడు. బెయిర్‌స్టో చేతికి చిక్కాడు.

    8 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 65 పరుగులుగా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు.

    ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నేల తడిసి ఔట్‌ఫీల్డ్ నెమ్మదిగా ఉంది. గయానాలో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • 27 Jun 2024 09:55 PM (IST)

    మళ్లీ మొదలైన వర్షం.. ఆగిన మ్యాచ్

    65 పరుగులు

    2 వికెట్లు

    8 ఓవర్లు

  • 27 Jun 2024 09:44 PM (IST)

    రెండు వికెట్లు కోల్పోయిన భారత్

    రెండు వికెట్లు కోల్పోయిన భారత్

  • 27 Jun 2024 09:04 PM (IST)

    ఇరుజట్ల ప్లేయింగ్ 11

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

    ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్, కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ.

  • 27 Jun 2024 08:52 PM (IST)

    టాస్ గెలిచిన ఇంగ్లండ్..

    టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

  • 27 Jun 2024 08:46 PM (IST)

    8.50 గంటలకు టాస్..

    వర్షం ఆగడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. దీంతో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. రాత్రి 8.50గంటలకు టాస్ జరగనుంది. 9 గంటల 15 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది.

  • 27 Jun 2024 07:57 PM (IST)

    IND vs ENG Live Update: టాస్ వాయిదా..

    గయానాలో వర్షం ఆగిపోయింది. కానీ, ప్రస్తుతానికి టాస్ వాయిదా పడింది. కొంత సమయం తర్వాత మైదానాన్ని అంపైర్లు పరిశీలించనున్నారు. ఆ తర్వాత నిర్ణయం వెలువడనుంది.

  • 27 Jun 2024 07:34 PM (IST)

    IND vs ENG Live Update: ఎట్టకేలకు ఆగిన వర్షం..

    మరోసారి వర్షం ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మైదానం ఇంకా కవర్లతో కప్పబడి ఉంది. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉన్నారు. అంపైర్ మైదానంలోకి వచ్చి, ఆపై భారత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడాడు.

  • 27 Jun 2024 07:29 PM (IST)

    తగ్గిన వర్షం..

    గయానాలో ప్రస్తుతం వర్షం ఆగిపోయింది.

  • 27 Jun 2024 07:04 PM (IST)

    మరలా మొదలైన వర్షం..

    గయానాలో మరలా వర్షం మొదలైంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్ సమయానికి పడే అవకాశం లేదు.

  • 27 Jun 2024 06:37 PM (IST)

    మ్యాచ్ రద్దయితే ఫైనల్ కు భారత్..

    భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే.. టీమ్ ఇండియాకు ఫైనల్ టిక్కెట్ దక్కుతుంది. భారత జట్టు  గ్రూప్‌లో నంబర్ వన్ టీమ్ కావడమే దీనికి కారణం.

  • 27 Jun 2024 06:35 PM (IST)

    కమ్మేసిన మేఘాలు

    గయానాలో భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. దీంతో మ్యాచ్ కు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ వర్షం ఆగిపోయింది. కానీ, ఆకాశంలో చీకటి మేఘాలు ఉన్నాయి. మ్యాచ్ రోజు వర్షం కురుస్తుందని ముందే అంచనాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్ వాష్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది.

  • 27 Jun 2024 06:33 PM (IST)

    టీ20 ప్రపంచకప్‌లో తగ్గేదేలే..

    టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు ఐదోసారి తలపడనున్నాయి. గతంలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలో 2 మ్యాచ్ ల్లో విజయం సాధించాయి.

  • 27 Jun 2024 06:30 PM (IST)

    IND vs ENG Live Score: భారత్‌దే పైచేయి

    టీ20 క్రికెట్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా అందులో భారత్ 12 సార్లు గెలిచింది. ఇంగ్లండ్‌ 11 సార్లు మాత్రమే గెలుపొందింది. టీ20 పిచ్‌పై ఇరు జట్ల మధ్య ఇది ​​24వ పోరు.

Published On - Jun 27,2024 6:28 PM

Follow us