AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2nd T20: ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ అద్భుత రికార్డ్.. బ్రేక్ చేసేందుకు సిద్ధమైన భారత్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు?

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ ఎన్నడూ ఓడిపోలేదు. అదే సమయంలో ఈ మైదానంలో 2014లో భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 మ్యాచ్ జరగ్గా, ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 66 పరుగులు చేశాడు.

IND vs ENG 2nd T20: ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ అద్భుత రికార్డ్.. బ్రేక్ చేసేందుకు సిద్ధమైన భారత్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు?
Ind Vs Eng 3rd t20
Venkata Chari
|

Updated on: Jul 09, 2022 | 2:59 PM

Share

IND vs ENG Edgbaston T20: భారత్-ఇంగ్లండ్ మధ్య ఈరోజు ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో T20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. నిజానికి భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 3 టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు భారత జట్టులోకి తిరిగి రానున్నారు. సౌతాంప్టన్‌లో జరిగిన మొదటి T20 మ్యాచ్‌లో, విరాట్ కోహ్లీతో సహా ముగ్గురు ఆటగాళ్లు టీమ్ ఇండియాలో భాగం కాలేదు. అయినప్పటికీ, భారత్ 50 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.

భారత జట్టుకు సిరీస్‌ గెలిచే అవకాశం..

రెండో టీ20లో భారత జట్టు విజయం సాధిస్తే.. సిరీస్‌ రోహిత్ సేన వశమవుతోంది. అదే సమయంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో టీమ్ ఇండియా రికార్డు బాగానే ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 20 టీ20 మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పటివరకు ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య 1 టీ20 మ్యాచ్ జరిగింది. 2014లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ టీ20 మ్యాచ్ జరిగింది.

ఇవి కూడా చదవండి

ఎడ్జ్‌బాస్టన్‌లో టీ20లో ఇంగ్లండ్ ఎప్పుడూ ఓడిపోలేదు..

2014లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 66 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ మైదానంలో ఇంగ్లండ్ జట్టు ఇప్పటి వరకు 3 టీ20 మ్యాచ్‌లు ఆడగా, మూడు మ్యాచ్‌ల్లోనూ ఆతిథ్య జట్టు విజయం సాధించింది. ఈ విధంగా, ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ రికార్డు అద్భుతంగా ఉంది.

రెండు జట్ల ప్లేయింగ్ XI ఇలా ఉండొచ్చు..

నేటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా కూడా భారత జట్టులో అందుబాటులో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేయింగ్ ఎలెవన్‌ ఎంపిక జట్టు మేనేజ్‌మెంట్‌కు చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ఈ అనుభవజ్ఞులు లేకపోయినా టీ20 సిరీస్‌లో భారత జట్టు తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోవైపు, ఇంగ్లాండ్ ప్లేయింగ్ XIలో ఒకటి లేదా రెండు మార్పులు చేయవచ్చు.

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్), డేవిడ్ మలన్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, మాథ్యూ పార్కిన్సన్, రిచర్డ్ గ్లీసన్

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌