‘బీ కేర్‌ఫుల్ టీమిండియా’.. కోహ్లీసేనకు ఇంగ్లాండ్ కెప్టెన్ వార్నింగ్.. అసలు ఏమన్నాడంటే.!
India Vs England 2021: క్రికెట్‌లో స్లెడ్జింగ్ సర్వసాధారణం. పెద్ద జట్లకు సంబంధించిన సిరీస్‌లు ఏదైనా సరే.. మ్యాచ్‌లు మొదలు కావడానికి...
India Vs England 2021: క్రికెట్‌లో స్లెడ్జింగ్ సర్వసాధారణం. పెద్ద జట్లకు సంబంధించిన సిరీస్‌లు ఏదైనా సరే.. మ్యాచ్‌లు మొదలు కావడానికి కొద్దిరోజుల ముందు నుంచే ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం షూరూ అవుతుంది. తాజాగా భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ముందు ఈ తంతు మొదలైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఇన్‌డైరెక్ట్‌గా టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను అడ్డుకోవడం అసాధ్యమని.. అస్త్రశస్త్రాలతో భరతం పట్టేందుకు సిద్దంగా ఉన్నాడని.. టీమిండియా బ్యాట్స్‌మెన్ కాసింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.
నెట్స్‌లో ఆర్చర్ బంతులు బులెట్ల కంటే వేగంగా వస్తున్నాయని.. టీమిండియా బ్యాట్స్‌మెన్ వాటిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం ఖాయమని అన్నాడు. కాగా, భారత్‌లో ఆర్చర్ పర్యటించడం ఇదే మొదటిసారి. అయితే ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉండటం వల్ల.. ఇక్కడి పిచ్‌ల గురించి అతడికి బాగా తెలుసని చెప్పాలి. ఇదిలా ఉంటే జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లతో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, ఓలీ స్టోన్స్‌లతో ఇంగ్లీష్ బౌలింగ్ ఎటాక్.. ఆర్చర్ రాకతో పటిష్టంగా తయారైంది.
ఇక స్టోక్స్ విషయంపై కూడా రూట్ మాట్లాడుతూ.. అతడు టీమిండియాపై ఆడేందుకు సంసిద్దంగా ఉన్నాడని.. బాగా ఆడతాడన్న నమ్మకం ఉందని రూట్ అన్నాడు. కాగా, సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని చదవండి:
మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్ ప్రకారమే..
టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!