భారత్ వెర్సస్ ఇంగ్లాండ్.. ఉత్కంఠభరితంగా సాగనున్న పోరు.. ఆ ఆటగాళ్లే కీలకం.!!
India Vs England 2021: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య భీకర పోరుకు రంగం సిద్దమైంది. రేపటి నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు మొదలు కానుంది.
India Vs England 2021: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య భీకర పోరుకు రంగం సిద్దమైంది. రేపటి నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు మొదలు కానుంది. గత సిరీస్‌లలో విజయం సాధించిన ఈ రెండు జట్లూ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ కోసం తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఆస్ట్రేలియాపై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుని టీమిండియా ఫుల్ జోష్‌లో ఉండగా.. శ్రీలంకతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఇంగ్లాండ్ గెలుపే ధ్యేయంగా భారత్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత పోరు ప్రేక్షకులను విపరీతంగా అలరించనుంది. అంతేకాకుండా అది గేమ్‌పై కూడా ప్రభావం చూపనుంది. ఆ ఆటగాళ్లు ఎవరన్నది ఇప్పుడు చూద్దాం..
1. విరాట్ కోహ్లీ వెర్సస్ ఆండర్సన్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్‌పై అద్భుత రికార్డు ఉంది. అందులోనూ.. స్వదేశంలో ఆడిన తొమ్మిది టెస్టుల్లో 70.25 సగటుతో 843 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. అటు జేమ్స్ ఆండర్సన్‌కు కూడా భారత పిచ్‌లపై అమోఘమైన రికార్డు ఉంది. గతంలో ఆడిన 10 టెస్టులో 26 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ చాలా ఏళ్ల తర్వాత స్వదేశంలో తలబడబోతున్నారు.
2. రోహిత్ శర్మ వెర్సస్ ఆర్చర్
బౌలింగ్ ఏదైనా.. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే చాలు రోహిత్ శర్మ విధ్వంసం మాములుగా ఉండదు. హిట్ మ్యాన్‌కు స్వదేశంలో మంచి రికార్డు ఉంది. 14 టెస్టుల్లో 1325 పరుగులు చేశాడు. అందులో ఆరు భారీ సెంచరీలు నమోదు చేశాడు. ఇక ఆర్చర్ విషయానికి వస్తే.. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం మెండుగా ఉంది. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా తన షర్ట్ పిచ్ బంతులతో భయపెట్టగల సమర్ధుడు. ఈసారి వీరిద్దరి పోటి ప్రేక్షకులకు మంచి మజాను ఇస్తుంది.
3. పుజారా వెర్సస్ బ్రాడ్
పుజారా, బ్రాడ్.. ఈ ఇద్దరూ తమ తమ జట్లకు పిల్లర్స్ లాంటివారు. టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు పుజారా ‘ది వాల్’ అయితే.. ఇంగ్లాండ్ బౌలింగ్‌కు బ్రాడ్ వెన్నుముక. ఇంగ్లాండ్‌పై పుజారా డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అలాగే వారి బౌలింగ్ లైనప్‌ను సైతం అద్భుతంగా ఎదుర్కున్నాడు. అటు భారత్‌పై మొత్తం 20 టెస్టులు ఆడి.. 70 వికెట్లు పడగొట్టాడు. పుజారాను ఔట్ చేయగల సమర్ధుడు ఎవరైనా ఉన్నాడంటే అది బ్రాడ్ అని చెప్పాలి. వీరే కాదు.. జో రూట్- బుమ్రా, బెన్ స్టోక్స్- అశ్విన్ మధ్య కూడా భీకర పోరు జరగనుంది.
మరిన్ని చదవండి:
మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో భార్యను కిరాతకంగా.. పక్కా ప్లాన్ ప్రకారమే..
టీమిండియాకు ప్రపంచకప్ అందించాడు.. ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నాడు.. ఆ బ్యాట్స్‌మెన్ ఎవరంటే.?
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా.? అయితే ఈ ఐలాండ్‌లో జాలీగా హాలీడేను ఎంజాయ్ చేయండి..!