AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. టార్చర్‌కు సిద్ధమైన ఆర్చర్.. పెవిలియన్‌కు క్యూ కట్టాల్సిందే?

భారత యువ ఆటగాళ్ల దూకుడుకు, ఇంగ్లాండ్ అనుభవజ్ఞుల వ్యూహాలకు నడుమ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. ఐర్లాండ్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న టీమిండియా, ఇంగ్లాండ్ వేసే ఉచ్చుల నుంచి తప్పించుకుని సిరీస్‌లో బోణీ కొడుతుందో లేదో చూడాలి.

IND vs ENG: మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. టార్చర్‌కు సిద్ధమైన ఆర్చర్.. పెవిలియన్‌కు క్యూ కట్టాల్సిందే?
Jofra Archer Ind Vs Eng 1st T20i
Venkata Chari
|

Updated on: Jul 01, 2026 | 6:10 AM

Share

IND vs ENG: ఐర్లాండ్‌ పర్యటనలో ఊహించని పరాభవం తర్వాత, భారత యువ జట్టు ఇప్పుడు మరో మహా సంగ్రామానికి సిద్ధమైంది. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా బుధవారం ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ పోరులో భారత్‌కు అసలైన ముప్పు ఇంగ్లీష్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ రూపంలో పొంచి ఉంది.

ఐర్లాండ్ చేదు జ్ఞాపకాలను చెరిపేసేందుకు కసిగా భారత్..

వరుసగా 16 టీ20 సిరీస్‌లు గెలిచి అప్రతిహతంగా దూసుకుపోతున్న టీమిండియా విజయ పరంపరకు ఐర్లాండ్ షాకిచ్చింది. 0-2తో ఆ సిరీస్‌ను కోల్పోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై వారి సొంత గడ్డపైనే సత్తా చాటాలని భారత్ కసిగా ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరగబోయే కొన్ని కీలకమైన ఆటగాళ్ల పోరాటాలు (ప్లేయర్ బాటిల్స్) మ్యాచ్ ఫలితాన్ని శాసించనున్నాయి.

అభిషేక్ శర్మ వర్సెస్ జోఫ్రా ఆర్చర్

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే పరుగుల సునామీ ఖాయం. కానీ, అతడిని అడ్డుకోవడానికి ఇంగ్లాండ్ తన ప్రధాన అస్త్రం జోఫ్రా ఆర్చర్‌ను రంగంలోకి దించుతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్చర్ చేతిలో అభిషేక్ రెండు సార్లు డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే, అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం అభిషేక్ కేవలం 33 బంతుల్లోనే 61 పరుగులు సాధించి ఆర్చర్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. పవర్‌ప్లేలో వీరిద్దరి మధ్య జరిగే ఈ పోరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలవనుంది.

సంజూ శాంసన్‌కు ఆర్చర్ బౌన్సర్ల పరీక్ష..

రాజస్థాన్ రాయల్స్ జట్టులో సహచరుడైన ఆర్చర్ బలాలు, బలహీనతలు సంజూ శాంసన్‌కు బాగా తెలుసు. కానీ, ఆర్చర్ సంధించే వేగవంతమైన బౌన్సర్లు శాంసన్‌ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. గత ఏడాది 2025లో ఆర్చర్ బౌలింగ్‌లో శాంసన్ మూడు సార్లు అవుట్ కాగా, ఈ ఏడాది 2026లో మాత్రం శాంసన్ ఏకంగా 271 స్ట్రైక్ రేట్‌తో చెలరేగి పగ తీర్చుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

స్పిన్‌ను ఊచకోత కోసే దూబే.. రషీద్‌ను అడ్డుకుంటాడా?

భారత మిడిలార్డర్‌లో శివమ్ దూబే పాత్ర అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్రధాన స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఎదుర్కోవడంలో దూబే రికార్డు అద్భుతంగా ఉంది. టీ20ల్లో రషీద్ వేసిన 19 బంతుల్లోనే దూబే 47 పరుగులు పిండుకున్నాడు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే దూబేను ఈ మ్యాచ్‌లో కాస్త ముందుకు ప్రమోట్ చేస్తే భారత ఇన్నింగ్స్‌కు తిరుగుండదు.

వరుణ్ ఫిట్‌నెస్ ఆందోళన.. అర్ష్‌దీప్ స్వింగ్ మాయాజాలం..

మరోవైపు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిట్‌నెస్‌పై ఇంకా నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. ఒకవేళ అతడు జట్టులోకి వస్తే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు తిప్పలు తప్పవు. ఎందుకంటే బ్రూక్‌ను వరుణ్ ఇప్పటికే మూడు సార్లు అవుట్ చేశాడు. ఇక బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ విసిరే ఇన్‌స్వింగర్లను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌కు పెద్ద సవాల్ కానుంది. గతంలో సాల్ట్‌ను అర్ష్‌దీప్ రెండు సార్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us