IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన రోహిత్ సేన.. ఆధిపత్యం ఎవరిదంటే?

IND vs AUS T20 Series: సెప్టెంబర్ 20 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ జరగనుంది. T20 ఇంటర్నేషనల్‌లో ఇరు జట్ల గణాంకాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైన రోహిత్ సేన.. ఆధిపత్యం ఎవరిదంటే?
India Vs Australia T20 Series
Follow us
Venkata Chari

|

Updated on: Sep 16, 2022 | 8:15 PM

IND vs AUS T20 Series: ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. సెప్టెంబర్ 20 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ మొహాలీలో జరగనుంది. 2022 టీ20 ప్రపంచకప్ సన్నాహాలను పరిశీలిస్తే, ఈ సిరీస్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. సిరీస్ ప్రారంభానికి ముందు, T20 ఇంటర్నేషనల్‌లో ఇరు జట్ల గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

అంతర్జాతీయ టీ20లో ఇరు జట్ల ప్రదర్శన ఇదే..

టీం ఇండియా ఇప్పటి వరకు మొత్తం 179 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 114 మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో 57 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇది కాకుండా మూడు మ్యాచ్‌లు టై కాగా, ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు గురించి మాట్లాడితే, కంగారూలు ఇప్పటివరకు 158 టీ20లు ఆడారు. ఆస్ట్రేలియా జట్టు 82 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 70 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 6 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు.

ఇవి కూడా చదవండి

గెలుపు శాతంలో టీమిండియా ముందుంజ..

టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాలో విజయ శాతం గురించి మాట్లాడితే, టీమ్ ఇండియా ముందుంది. టీ20 ఇంటర్నేషనల్‌లో టీమ్ ఇండియా విజయాల శాతం 67.24 కాగా, ఆస్ట్రేలియా విజయాల శాతం 53.87గా ఉంది.

హెడ్ టూ హెడ్ పోటీల్లో పైచేయి ఎవరిదంటే..

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 23 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

భారతదేశంలో లెక్కలు..

భారత గడ్డపై ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.