IND vs AUS 3rd T20: ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20 సిరీస్‌లో బోణి కొట్టిన ఆసిస్..
5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి.. టీ20 సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు జరిగిన మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. మ్యాక్స్ వెల్ 48 బంతుల్లో 104 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఆసీస్ జట్టులో ట్రావిస్ హెడ్ 35 పరుగులు, మాథ్యూ వేడ్ 28, మార్కస్ 17 పరుగులు సాధించాడు. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే..

భారత్, ఆస్ట్రేలియాల మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది. మ్యాక్స్‌వెల్ అద్భుత ఆటతీరును జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి క్షణం వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయాన్ని సాధించింది.
5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి.. టీ20 సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు జరిగిన మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. మ్యాక్స్ వెల్ 48 బంతుల్లో 104 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఆసీస్ జట్టులో ట్రావిస్ హెడ్ 35 పరుగులు, మాథ్యూ వేడ్ 28, మార్కస్ 17 పరుగులు సాధించాడు. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. రవి బిషోని 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, అక్సర్ పటేల్ ఒక్కో వికెట్‌ను తీసుకున్నారు. ఇక ఐదు టీ20 సిరీస్ లో 2-1తో భారత్ ముందంజలో ఉంది.
ఇక అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు రావడంతో స్కోర్ దూసుకుపోయింది. ఇక ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ 57 బంతుల్లో 123 పరుగులు చేశాడు. దీంతో తన T-20 కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. గైక్వాడ్ సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. గైక్వాడ్ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. తిలక్ వర్మ 31 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.
View this post on Instagram
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్/కెప్టెన్), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
