ICC World Cup 2023 Final: ఆ రెండు జట్ల మధ్యే ప్రపంచకప్ ఫైనల్: టీమిండియా మాజీ ప్లేయర్
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నం. 2, నం. 3 జట్లు. ఈడెన్ గార్డెన్ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయినప్పటికీ, ఇక్కడ మాత్రం ఆస్ట్రేలియాదే పైచేయి అని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా బౌలింగ్ అంత బాగా లేకపోయినా బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్నారు. నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ తెలిపాడు.

ICC World Cup 2023 Final: ప్రపంచకప్ 2023లో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లలో సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ ఆడనున్నాయి. అయితే, ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య (IND vs AUS) జరగనుందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆయన ప్రకారం, ఈసారి ప్రపంచకప్ ఫైనల్ ఈ రెండు జట్ల మధ్య జరిగేందుకే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.
ఆస్ట్రేలియా జట్టు గురించి మాట్లాడితే, ప్రపంచ కప్‌లో ఆ జట్టు ఆరంభం అంత బాగా లేదు. తమ మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత ఆ జట్టు పునరాగమనం చేసి వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో భారత జట్టు కూడా వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాను ఓడించగలదు – ఆకాష్ చోప్రా..
ఆకాష్ చోప్రా ప్రకారం, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు రెండూ గొప్ప ఫామ్‌లో ఉన్నాయి. అందుకే ఫైనల్ మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య మాత్రమే జరిగేందుకు 100 శాతం అవకాశాలున్నాయని ఈ మాజీ టీమిండియా ప్లేయర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు.
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నం. 2, నం. 3 జట్లు. ఈడెన్ గార్డెన్ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయినప్పటికీ, ఇక్కడ మాత్రం ఆస్ట్రేలియాదే పైచేయి అని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా బౌలింగ్ అంత బాగా లేకపోయినా బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్నారు. నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ తెలిపాడు.
View this post on Instagram
మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అలాగే రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఇక నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇరు జట్లు:
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్ , శార్దూల్ ఠాకూర్.
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..