IND vs AUS: ఇండోర్‌లో వారిదే హవా.. మరోసారి ఆస్ట్రేలియాకు చుక్కలే.. ఆ స్పెషల్ ప్లాన్ ఏంటంటే?
Border-Gavaskar Trophy:ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టులో ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ ఆధిపత్యం చెలాయించింది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తొలి 2 మ్యాచ్‌లు గెలిచి 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో భాగంగా మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో మ్యాచ్ జరగనుంది. అయితే, ఇప్పటి వరకు స్పిన్ బౌలర్లు సత్తా చాటగా, ఇండోర్‌లో ఫాస్ట్ బౌలర్ల వంతు రానుందని తెలుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో భారత స్పిన్నర్లు విధ్వంసం సృష్టించారు. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మొత్తం 7 వికెట్లు, ఆర్ అశ్విన్ మొత్తం 8 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మహ్మద్ షమీకి 3, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.
అదే సమయంలో ఢిల్లీ టెస్టులో షమీతో పాటు స్పిన్నర్లు జడేజా, అశ్విన్ కూడా సత్తా చాటారు. షమీ 4 వికెట్లు, జడేజా 10 వికెట్లు, అశ్విన్ 6 వికెట్లు తీశారు. తొలి రెండు మ్యాచ్‌లలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. అయితే ఇండోర్‌లో షమీ, సిరాజ్ విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. పిచ్‌ని చూసిన తర్వాత ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని అంటున్నారు.
ఫాస్ట్ బౌలర్లకు ప్రయోజనం..
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్ ఎర్రమట్టితో తయారు చేశారు. దీనిని ఇండోర్ నుంచి 600 కి.మీ దూరంలో ఉన్న ముంబై నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ చేశారంట. రెడ్ క్లే పిచ్ నుంచి ఫాస్ట్ బౌలర్లు చాలా సహాయం పొందే అవకాశం ఉందంట. ఫాస్ట్ బౌలర్లు ఇక్కడ అదనపు బౌన్స్ పొందుతారు. ఇటువంటి పరిస్థితిలో, భారత్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఇండోర్‌లో దిగవచ్చని తెలుస్తోంది. కాగా, గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.
మూడో ఫాస్ట్ బౌలర్ ఎవరు?
ఇండోర్ పిచ్ నుంచి ఫాస్ట్ బౌలర్లు ప్రయోజనం పొందుతారు. సిరీస్ గెలిచిన ఉత్సాహంతో దూసుకెళ్తోన్న టీమిండియా.. మూడవ ఫాస్ట్ బౌలర్‌గా ఎవరిని ఆడిస్తారో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది? షమీ, సిరాజ్‌లతో త్రయం ఎవరు చేస్తారోనని ఊహాగానాలు మొదలయ్యాయి. భారత్‌లో మూడో ఫాస్ట్ బౌలర్‌గా జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్ ఉన్నారు. మూడో బౌలర్‌కి అవకాశం తక్కువగా కనిపించినా.. బ్యాట్‌తోనూ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ అద్భుతాలు చేస్తున్నారు.
గత 4 మ్యాచ్‌ల్లో ఫాస్ట్ బౌలర్ హవా..
ఇండోర్‌లో ఫాస్ట్ బౌలర్ల హవా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆడిన గత 4 రంజీ మ్యాచ్‌ల రికార్డులు చూస్తే.. జనవరి 10, ఫిబ్రవరి 8 మధ్య, ఇండోర్‌లో రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ 4గురు ఫాస్ట్ బౌలర్లు 5 వికెట్ల క్లబ్‌లో చేరారు. గుజరాత్‌కు చెందిన చింతన్ గజా తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. త్రిపురకు చెందిన రాణా దత్తా 82 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పృథ్వీ రాజ్ 26 పరుగులిచ్చి 5 వికెట్లు, బెంగాల్‌కు చెందిన ఆకాశ్‌దీప్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..